ఉగాది పచ్చడి తినడం వల్ల.. కలిగే లాభాలేంటి..?
ఉగాది పండుగను దక్షిణ భారతదేశంలో చాలా స్పెషల్ గానే జరుపుకుంటారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు కర్ణాటక, మహారాష్ట్ర, కన్నడ వంటి ప్రాంతాలలో కూడా ఉగాదిని చాలా ముఖ్యమైన పండుగగానే జరుపుకుంటూ ఉంటారు. హిందూ పంచాంగా లెక్కల ప్రకారం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఈ ఉగాది వస్తూ ఉంటుందని మన పురాణాల సైతం తెలియజేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కలియుగం ప్రారంభమైన రోజునే ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు శ్రీరామునికి పట్టాభిషేకం జరిగిందని పూర్వికులు సైతం చెబుతూ ఉంటారు.
నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ కొత్త ఆశలతో, ఆయురారోగ్యాలతో ,శుభ ఫలితాలు కలుగుతూ కుటుంబం అంతా సంతోషంగా జరుపుకొని ఈ ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి తినడం చాలామంది ఆనవాయితీగాని చేస్తూ ఉంటారు. ఈ ఉగాది పచ్చడిని ఆరు రుచులను కలిపి చేస్తారు... అందులో తీపి, చేదు, ఉప్పు, వగరు, కారం, పులుపు.. కలిపి చేస్తారు. ఈ ఉగాది పచ్చడి తినడం వల్ల చాలా లాభాలు ఉంటాయట.
ఉగాది పచ్చడిలో లేత మామిడి పిందెలు, వేప పువ్వులు, మిరపకాయ, ఉప్పు, బెల్లం, చింతపండు ఉపయోగించడం వల్ల ఉగాది పచ్చడిగా మారుతుంది..
బెల్లం తినడం వల్ల శరీరానికి ఐరన్ లభిస్తుంది.
చింతపండు జీర్ణాశయం ఆరోగ్యంగా జరగడానికి.
మిరప కారం రక్తప్రసరణను పెంచడానికి.
ఉప్పు శరీరంలో నీటి సమతుల్యతను నియంత్రించడానికి.
లేత మామిడి పిందెలు మన శరీరంలో టాక్సీసులను తొలగించడానికి.
వేప పువ్వు కాలేయాన్ని శుభ్రపరచడానికి సహాయపడతాయట.
వీటన్నిటిని కలిపి తినడం వల్ల కొత్త సంవత్సరం మనం ఆయురారోగ్యంగా ఉంచడానికి శుభదినంగా తోడ్పడుతుంది.