డేటింగ్.. చీటింగ్ ఇది రెండు ఉంటే ఏం జరుగుతుందో తెలుసా?

lakhmi saranya
తరచుగా డేటింగ్ యాప్ లలో చాటింగ్ చేస్తూ మహిళలకు వల వెయటమే అతని పని. ముఖ్యంగా 18 నుంచి 35 ఏండ్ల మధ్య వయస్కులే అతని టార్గెట్. అందుకోసం బంబుల్, స్నాప్ చాట్ సహా పలు డేటింగ్ యాప్ లలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు. తాను అమెరికాకు చెందిన మోడల్ నంటూ పరిచయాలు పెంచుకున్నాడు. అందమైన మెసేజ్ లతో, మాటలతో ఆకట్టుకున్నాడు. ఒకరా ఇద్దరా దాదాపు 700 నందిని లైన్ లో పెట్టిన ఢిల్లీకి చెందిన తుషార్ బిస్ట్ చేసిన ఘనకార్యమిది. పలువురు డేటింగ్ యాప్ లో పలువురు మహిళల ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు సేకరించాడు. తాను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే, చెప్పినట్లు వినకపోతే ట్రోల్ చేస్తానని బ్లాక్ మెయిల్ చెయ్యటం ప్రారంభించాడు. చివరికి పాపం పండింది.
 బాధ్యతుల్లో కొందరి ఫిర్యాదుతో జనవరి 4, శనివారం నాడు ఢిల్లీ సైబర్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. పైన పేర్కొన్న సంఘటన కేవలం ఒక ఉదాహరణ మాత్రమే.. మనదేశంలో, రాష్ట్రంలో, చివరికి హైదరాబాద్లో కూడా డేటింగ్ యాప్ లు, సైట్ లో మోసాలు పెరిగిపోతున్నాయి. తరచుగా వాటిలో నిమగ్నం అవ్వటం యువతి యువకుల్లో వ్యసనంగా మారుతోంది. ఇదే అదునుగా మోసగాళ్లు, సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. చీటింగ్ చేసే వ్యక్తులు అమ్మాయిలైతే అబ్బాయిలకు, అబ్బాయిలైతే అమ్మాయిలకు వలపుల వల్ల విసురుతారు. మాటల్లో దించుతారు. అవతలి వ్యక్తి బలహీనలన్నీ తెలుసుకుంటారు. చివరికి కలుద్దామని చెప్పి, అవసరాల పేరుతో డబ్బులు వసూలు చేసేవారు కొందరైతే,
ఫేక్ అకౌంట్లో పేరుతో అవతలి వ్యక్తి ఫోటోలు, వీడియోలు సేకరించి, ఆశ్లీలంగా మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసేవారు ఇంకొందరు. బాబోద్వేగాలతో అడుకునే వారు మరికొందరు. ఇలా మోసగాళ్లకు చేతిలో నలిగిపోతూ బయటకు చెప్పుకోలేక లోని మథన పడుతున్నవారు చాలామంది ఉంటారని ఇపునులు చెబుతున్నారు. కొందరు ధైర్యం చేసి వివరించడమో, పోలీసులకు ఫిర్యాదు చెయ్యటము చేస్తుంటే, మరి కొందరు పరువు పోతుందనే దేశంతో మోసగాళ్లు అడిగింది ఇచ్చేసి గమ్మునుంటున్నారు. తెలిసింది కదా ఇకనైనా అలాగా ఉండండి! అది 2024, జనవరి 28.. ఢిల్లీలో నివాసం ఉంటూ సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యువకుడికి డేటింగ్ యాప్ లో అమ్మాయి పరిచయమైంది. మాట మాట కలిపింది. వలపు వల్ల విసిరింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: