చలికాలంలో ముల్తాని మట్టిని ఇలా వాడితే... మీ ముఖం అద్దంలో మెరుస్తుంది.!
వింటర్ సీజన్లో పొడిగాలి చర్మం లోని తేమను గ్రహించడం వల్ల స్కిన్ మెరుపు కోల్పోతుంది. చర్మం పొడిబారుతుంది. ముఖ్యంగా పెదవులు, అరచేతులు, పాదాలపై పగుళ్లు ఏర్పడతాయి. చర్మంపై తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. చర్మం పొడిగా, దురదగా, ఎర్రగా మారుతుంది. కాబట్టి చలికాలంలో చర్మ సంరక్షణకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. అయితే, చలికాలంలో ముల్తాని మట్టిని ఉపయోగించటం చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ముల్తానీ మట్టి క్రిమినాశక లక్షణాలను కలిగి ఉన్నందున మొటిమలు, మచ్చలు, టానింగ్ మొదలైన సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. చలికాలంలో మీ ముఖాన్ని మెరిసేలా చేసే ముల్తాని మట్టిని అప్లై చేసే విధానం గురించి ఇక్కడ చూద్దాం.
ముల్తానీ మట్టి, తేనెను ఉపయోగించవచ్చు. దీనికోసం ముల్తానీ మట్టి, తేనెను బాగా మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. దీన్ని చర్మానికి అప్లై చేసిన 10-15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ రెసిపీని జ్వరానికి రెండుసార్లు ప్రయత్నించండి. ఇలా చేస్తే మీ ముఖం మెరిసిపోతుంది. మరో పద్ధతిలో ముల్తాని మట్టిని పాలలో కలిపి అప్లై చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. చర్మం కూడా మెరుగు పడుతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మొల్తాన్ని మట్టిలో పెరుగు కలిపి ముఖానికి రాసుకుంటే ముడతలు, ముఖంపై గీతలు, చారలు వంటివి తగ్గుతాయి.