వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు... దూరంగా ఉంటేనే ఆరోగ్యానికి మేలు..!

lakhmi saranya
బాదం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రైఫ్రూట్స్ లో ఒకటి. ఇందులో విటమిన్లు మినరల్స్ ప్రోటీన్లు కాల్షియం ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్స్ ఫుల్ గా ఉంటాయి. కాబట్టి తింటే మంచిదని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అయితే కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు మాత్రం వీటిని తినకూడదు ఆ ప్రాబ్లమ్స్ ఏమిటి? ఎందుకు తినకూడదు చూద్దాం. మైగ్రేన్ తో బాధపడేవారు బాదం తినకూడదని ఆరోగ్యాన్ని ప్రజలు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది.
 మై గ్రాండ్ లేదా తలనొప్పి ఉన్నప్పుడు బాదం తింటే ఈ సమస్య మరింత పెరుగుతుంది. మైకం వికారం వాంతులు లాంటివి వస్తాయనేది నిపుణులు చెబుతున్నారు. హై బీపీ ఉన్నవారు కూడా ఎక్కువగా తినవద్దు. ఇందులో మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది రక్తపోటును మరింత పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఒకవేళ తినాలనుకుంటే వైద్యుల సలహాతో పరిమితంగా తినొచ్చు. కిడ్ని స్టాన్స్ ఉన్నవారు కూడా బాదం పప్పులు తినటం మంచిది కాదు. వీటిలో ఆక్సలేట్ సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల్లోకి చేరితే కాలుష్యం పేరుకుపోయి రాళ్లుగా ఏర్పడతాయి.
అలాగే కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు వీటిని తింటే అప్పటికే రాళ్లు ఉండే వాటి పరిమాణం పెరిగే అవకాశం లేకపోలేదు. ఈరోజుల్లో చాలామంది అజీర్తి కడుపు నొప్పి ఉబ్బరం గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వాళ్లు బాగా ఎక్కువగా తినకూడదు. బాదంపప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇవి వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల కడుపులో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. కడుపునొప్పి గ్యాస్ సమస్యలు మరింత తీవ్రమయ్యే ఛాన్స్ ఉంది. అధిక బరువు లేదా ఊబకాయ సమస్యతో బాధపడేవారు సైతం బాదం పప్పుల జోలికి పోకూడదు. బాదం పప్పులు క్యాలరీలు సంతృప్తి కొవ్వులు ఎక్కువగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: