శీతాకాలంలో వేడి నీటి స్నానం మంచిదేనా... నిపుణులు ఏం చెప్తున్నారంటే?

lakhmi saranya
శీతాకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ కూడా వేడి నీళ్లతోనే స్నానం చేస్తారు. చలి ఎక్కువగా ఉండటం వల్ల వేడి నీళ్లతో స్నానం చేస్తారు. చలికాలంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. దీనివలన చలి పెరుగుతుంది. కొందరైతే బయటకు రావడానికి కూడా వణికిపోతున్నారు. అయితే, అలాంటి సమయంలో వేడి నీటితో స్నానం చేసి మంచిగా రెస్ట్ తీసుకుందామని అనుకుంటారు. కానీ, వేడి నీటితో స్నానం చేయటం మంచిదా..? కాదా అని దీనిపై నిపుణులు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిపారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

 తెలుగు రాష్ట్రాల్లో చలి రోజు రోజుకి పెరుగుతుంది. ఈ సమయంలో చర్మాన్ని కాపాడుకోవటం కోసం వేటి నీటితో స్నానం చేస్తుంటారు. అయితే, చర్మ సంరక్షణకు వేడి నీటి స్నానం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. రోజు వేడి నీటితో స్నానం చేయడం వలన చర్మ సమస్యలు వస్తాయని తెలిపారు. చలికాలంలో కొన్ని జాగ్రత్తలతో తలస్నానం చేయాలని వైద్యులు చెబుతున్నారు. లేదంటే రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. మొటిమలు ఉన్నవారికి ఇంకా ఆ సమస్య ఎక్కువ అవుతుందని.. అలాగే గజ్జి, తామర వంటి చర్మ సమస్య కూడా వస్తాయని అంటున్నారు. కాబట్టి, వేడి నీటి స్నానం చలికాలంలో చేయకపోవడమే మంచిది.

కానీ చాలామంది వేడి నీళ్లు చేయడం వల్ల మైండ్ ఫ్రెష్ గా అనిపిస్తుందని ఫీలవుతూ ఉంటారు. కానీ వేడి నీళ్ల కంటే చన్నీళ్లు చాలా మంచివి. చన్నీళ్ళ స్నానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాకపోతే చలికాలంలో మాత్రం చన్నీళ్ల స్నానం చేయలేము. వేసవికాలంలో మాత్రం చన్నీళ్లనే ఎక్కువగా వాడతాము. చన్నీళ్ల స్నానానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. శీతాకాలంలో మాత్రం చన్నీళ్ళని అసలు చేయలేము. కాబట్టి గోరు వెచ్చని నీటితోనైనా స్నానం చేయవచ్చు. ఇలా చేయటం వల్ల మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: