బరువు తగ్గాలని ప్రోటీన్ ఫుడ్ అధికంగా తీసుకుంటున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే..?

lakhmi saranya
ఈరోజుల్లో చాలామంది బరువు అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటున్నారు. అలాంటి వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే బరువు అనేది తగ్గుతారో చూద్దాం. ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల బరువు అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంగా ఉండటానికి శరీరానికి ప్రోటీన్లు చాలా అవసరం. ఇది రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఎంజైములుగా పనిచేస్తూ శరీరంలోని రకరకాల రసాయనాల చర్యకు తోడ్పడుతుంది. ప్రోటీన్ ఆరోగ్యానికి మేలు చేస్తుంతనే ఉద్దేశంతో కొంతమంది హై ప్రోటీన్ తీసుకుంటారు. బరువు తగ్గేందుకు కూడా చాలా మంది ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు. అయితే, ఈ ప్రోటీన్ ఫుడ్ ని అతిగా తీసుకోవడం మంచిది కాదని ఫిట్ నెస్ నిపుణులు చెప్తున్నారు.
ఎందుకంటే... హై ప్రోటీన్ ఫుడ్ కార్బ్స్ ను తగ్గించి, శరీరంలోని పోషకాలు, ఫైబర్ ను గ్రహించుకోలేదని, జిర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతోందని తెలిపారు. రోజుకు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అనేది వయస్సు, కార్యచరణ, లింగం, ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. శారీరక శ్రమ ఎక్కువగా చెయని వారు రోజుకు ప్రతి కిలో గ్రాము శరీర బరువుకు 0.8 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజు గంటకు పైగా వర్కౌట్స్ చేసేవారు కిలో శరీర బరువుకు 1.2 లేదా 1.7 గ్రాముల వరకు ప్రోటీన్ తీసుకోవచ్చని చెప్తున్నారు. ఇలా సరైన మోతాదులో ప్రోటీన్ తీసుకునే వారు నారానికి కేజీ బరువు తగ్గవచ్చు. అయితే, ఈ ప్రోటీన్ ఫుడ్ ని అదిగా తీసుకుంటే మాత్రం బరువు పెరిగే అవకాశంతో పాటుగా ఇతర సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది
. అందుకే ప్రోటీన్లను శరీరానికి సరిపడా తీసుకోవటం మంచిది. ఈ ఆహారం పదార్థాల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అవేంటంటే... పప్పు ధాన్యాలు, పన్నీర్, చేపలు, గుడ్డు, పాల ఉత్పత్తులు, నట్స్, క్వినోవా వంటి వాటిలో పుష్కలంగా ఉంటుంది. వీటిని సరైన డైట్ ప్లాన్ ఆధారంగా తీసుకోవాలి. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్న వారికి మజిల్స్ తగ్గకుండా ఈ ప్రోటీన్ కాపాడుతుంది. దీనిని సరైన పరిమాణంలో తీసుకోవటం వల్ల కండరాల మాస్ ను కాపాడి, దాని బదులు ఫ్యాట్ తగ్గేలా చేస్తుంది. కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్ కంటే ప్రోటీన్ జీర్ణం కావాలంటే ఎక్కువ ఎనర్జీ అవసరం. దీనివల్ల జీవక్రియ రెట్లు పెరిగి, ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. ప్రోటీన్ లో ఉన్న ఆహారం తినటం వల్ల కడుపు నిండిన తృప్తి కలుగుతుంది. ఇది ఆహారం ఎక్కువ తినకుండా నియంత్రిస్తుంది. కార్బోహైడ్రేట్లు కంటే ప్రోటీన్లు జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల త్వరగా ఆకలి వేయదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: