ఏపీ: తల్లికి వందనం పై చంద్రబాబు కీలక ప్రకటన..!
తల్లికి వందనం పథకం పేరుతో అర్హులైన విద్యార్థులకు ప్రతి ఏటా ఒకో విద్యార్థికి రూ.15వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. అయితే ఇందులో స్కూలు, కాలేజీ నిర్వహణ ఖర్చుల నిమిత్తం రూ.2000 మినహాయింపు రూ .13 వేల రూపాయలు తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేయబోతోంది ఏపీ ప్రభుత్వం. ప్రైవేటు స్కూళ్లలో ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివి విద్యార్థులకు పథకానికి అర్హులు. గత ఏడాది విద్యార్థుల తల్లుల ఖాతాలు రాష్ట్ర వ్యాప్తంగా 67,01,653 మంది విద్యార్థులకు గాను రూ. 8,454 కోట్ల రూపాయలు నిధులను విడుదల చేశారు.
ఈ విషయంపై గతంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఏపీలో 84.27 శాతం మందికి ఈ పథకానికి నిధులు అందించామని వైసిపి హయాంలో కేవలం 60 శాతం మందికి మాత్రమే అందించారని తెలియజేశారు. ఈ పథకానికి విద్యార్థులు అర్హత పొందాలి అంటే 75% వరకు స్కూలుకు హాజరు ఉండాలి. అలాగే విద్యార్థి తల్లి పేరుతో బ్యాంకు అకౌంట్ కలిగి ఉండాలి. అకౌంట్ ఆధార్ లింక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి. ఏది ఏమైనాప్పటికీ కూటమి ప్రభుత్వ తల్లికి వందనం పథకం పైన గుడ్ న్యూస్ తెలియజేశారు