ఐశ్వర్య తో విడాకులపై .. ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చేసిన అభిషేక్ బచ్చన్..!

Divya
బాలీవుడ్ లో మోస్ట్ సెలబ్రెటీ కపుల్స్ గా పేరు సంపాదించిన జంటలలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ జంట కూడా ఒకరు. గత కొన్నేళ్లుగా ఈ జంటపైన పలు రకరకాల రూమర్స్ ఎక్కువగా వినిపించాయి. అయితే ఈ విషయం పైన ఎప్పుడు కూడా ఎవరు సరైన స్పష్టత ఇవ్వలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ తమ వైవాహిక బంధం గురించి చాలా హుందాగా మాట్లాడిన తీరు చూసి విడాకుల రూమర్స్ కి చెక్ పడిందని అభిమానులు భావిస్తున్నారు.




అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ మా ఇద్దరి మధ్య ఎలాంటి ఈగో సమస్యలు లేవని ఒకరినొకరు చాలా గౌరవించుకోవడమే తమ విజయ రహస్యం అంటూ తెలియజేశారు. తన భార్య ఐశ్వర్యారాయ్ కెరియర్ గురించి మాట్లాడుతూ నా భార్య తన పనిని వదులుకుంటేనే నేను సురక్షితంగా ఫీల్ అవుతాననే వ్యక్తిని కాదని, అలాంటి అభద్రత భావం మా ఇద్దరి మధ్య లేదు. నా తండ్రి అమితాబ్ బచ్చన్ కంటే నా తల్లి జయ బచ్చన్ పెద్ద స్టార్ అయినప్పటికీ కూడా వారు వివాహం చేసుకున్నారు. వారిద్దరి మధ్య ఉండే అన్యోన్యతను తాను చూశాను ఐశ్వర్య సాధించే విజయాలు నాకు గర్వకారణం అని అవి మా ఇద్దరి మధ్య ఎలాంటి ఈగో సమస్యలను తీసుకురావని అభిషేక్ బచ్చన్ తెలియజేశారు.


ఇక తన కుమార్తె ఆరాధ్య విషయానికి వస్తే పిల్లలకు నీతులు చెప్పడం కంటే మన ప్రవర్తన ద్వారా వారికి ఆదర్శంగా నిలవడమే నిజమైన పెంపకం అంటూ తెలిపారు. సరైన విలువలు బిడ్డకు అందించడంలో ఐశ్వర్య నేను ఎప్పుడు కూడా ఒకే మాట మీదే ఉంటామని తెలియజేశారు. రెండు దశాబ్దాల వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకోబోతున్న ఈ జంట తమ మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ వ్యాఖ్యలతో మరొకసారి తెలియజేశారు. అభిషేక్ బచ్చన్. 2007 ఏప్రిల్ 20న ఈ జంట వివాహం చేసుకున్నది. కానీ ఈ మధ్య విడాకుల రూమర్స్ ఎక్కువగా వినిపిస్తున్న తరుణంలో అభిషేక్ ఇలా పరోక్షంగా స్పష్టతనిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: