డెకాయిట్ టైలర్: విధ్వంసం సృష్టించిన అడవి శేష్..!

Divya
హీరో అడవి శేష్ తన సినీ కెరియర్లో తాను నటించే ప్రతి పాత్రకు ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటారు. తాజాగా నటిస్తున్న చిత్రం డేకాయిట్. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్ సైతం సినిమా అంచనాలను పెంచేసింది. ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ షనీల్ దేవ్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ప్రేమ అలాగే క్రైమ్ మధ్య నలిగిపోయో ఎమోషనల్ రైడ్ సినిమా అన్నట్టుగా కనిపిస్తోంది.


తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా ఆకట్టుకుంది. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ మాత్రమే కాకుండా హరి జూలియట్ అనే ఇద్దరు ప్రేమికుల కథ అన్నట్టుగా కనిపిస్తోంది. ట్రైలర్ విషయానికి వస్తే.. ప్రశాంతమైన జీవితాన్ని కోరుకున్న హరి, జూలియట్ ఒక ఊహించని ద్రోహం వల్ల జైలు పాలవుతాడు, అయితే అక్కడి నుంచి తప్పించుకొని బయటికి వచ్చిన తర్వాత జూలియట్  అనారోగ్యంతో ఉన్న కూతురు ప్రాణాలు కాపాడుకోవడానికి భారీ మొత్తంలో డబ్బు అవసరమైన స్థితిలో కనిపిస్తుంది. దీంతో తన ప్రేయసి అవసరకోసం ఎవరు ఊహించని ఒక ప్రమాదకరమైన నేర ప్రపంచంలోకి హరి అడుగు పెడతారు. అలా ఒక సామాన్య ప్రేమికుడు డేకాయిట్ గా ఎలా మారాడు అన్నదే ప్రధానం అన్నట్టుగా కనిపిస్తోంది.


అడివి శేష్ ప్రేమికుడిగా తెలివైన నేరస్తుడుగా తన విశ్వరూపాన్ని ట్రైలర్లో చూపించారు. మరొకసారి తన నటనతో ఆకట్టుకున్న అడవి శేష్, మృణాల్ ఠాకూర్  జూలియట్ పాత్రలో కూడా ఒదిగిపోయి నటించింది. అలాగే మరొకవైపు బిడ్డ కోసం తల్లడిల్లే తల్లిగా కూడా పండించిన సీన్స్ అందరిని హత్తుకునేలా కనిపిస్తున్నాయి. ఇందులో బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. అలాగే ప్రకాష్ రాజ్, ఆతుల్ కులకర్ణి, సునీల్ అంటే దిగ్గజ నటుడు ఇందులో నటిస్తున్నారు. ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: