త్రిష తమిళ రాజకీయ ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్టేనా..?
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో రెండు స్థానాలలో విజయ్ పోటీ చేయగా రెండు స్థానాలలో గెలిచారు. అందులో తిరుచ్చి ఈస్ట్ నియోజవర్గం నుంచి రాజీనామా చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు విజయ్ తప్పుకున్న ఆ స్థానం నుంచే త్రిష పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ గడిచిన కొన్ని రోజుల నుంచి ప్రముఖ హీరో, డైరెక్టర్, డాన్స్ మాస్టర్ అయిన రాఘవ లారెన్స్ ఈ స్థానం నుంచి టీవీకే పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారని వార్తలు మరింత వైరల్ గా మారాయి.
అయితే ఈ విషయం పైన తాజాగా రాఘవ లారెన్స్ స్పందిస్తూ సీఎం విజయ్ పార్టీ టీవీకే కోసం మొదటి నుంచి కష్టపడిన కార్యకర్తలకు మాత్రమే ఆ సీటు దక్కాలని ,తాను మధ్యలో వచ్చి పోటీ చేయడం కూడా రాజకీయ ధర్మం కాదంటూ తెలియజేశారు. ప్రస్తుతానికి తన ఎన్నికల బరి నుంచి తప్పుకోబోతున్నట్లు క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు ఎటు చూసినా కూడా త్రిష పేరు వినిపిస్తోంది. విజయ్ రాజీనామాతో ఖాళీ అయిన తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నిక బరిలో టీవీకే పార్టీ నుంచి త్రిష పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విధంగా తమిళనాడు రాజకీయాలలో కనిపిస్తోందని విశ్లేషకులు సైతం అభిప్రాయంగా తెలియజేస్తున్నారు. మరి పొలిటికల్ ఎంట్రీ పై త్రిష క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.