ఏపీ: ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇస్తున్న చంద్రబాబు..!
పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా సరే వారిని ఇక భరించబోమని మరో రెండో ఆలోచన లేకుండా సస్పెండ్ చేస్తామంటూ తీవ్రస్థాయిలో అసంతృప్తిని తెలియజేశారు. ఇటీవలే పల్నాడులో ఎస్పి ఆఫీసులో నరసారావు ఎమ్మెల్యే డాక్టర్ సిహెచ్ అరవిందబాబు వ్యవహారం సీఎం చంద్రబాబు నాయుడుకు కోపం తెప్పించింది. జిల్లా పోలీస్ సేల్ న్యాయ సలహాదారునిగా తాను సూచించిన రామినేనిప్రసాద్ పేరును ఎందుకు అంగీకరించలేదంటూ ఎమ్మెల్యే ఎస్పీ కృష్ణారావుతో వాగ్వాదానికి దిగారు. ఈ విషయంపై మార్చి 31న మంగళవారం నాడు ఎస్పీ ఆఫీసుకు వెళ్లారు ఎమ్మెల్యే.
ఎనిమిది నెలల క్రితమే న్యాయ సలహాదారు నియామకం పైన లేఖ పంపించినప్పటికీ ఇప్పటివరకు ఇంకా సంతకం ఎందుకు చేయలేదంటూ ఎమ్మెల్యే నిలదీశారు. విచారణ తర్వాత సంతకం చేస్తానంటూ ఎస్పీ చెప్పిన కూడా ఆర్డర్ కాపీ ఇచ్చేవరకు వెళ్లేది లేదంటే ఎమ్మెల్యే బీస్మించుకొని కూర్చున్నారు. అలా 10 గంటల పాటు అక్కడే ఉన్న ఎమ్మెల్యేకు మంత్రులు ఫోన్ చేసిన కూడా స్పందించకపోవడంతో ఈ ఎమ్మెల్యే వ్యవహారం అధిష్టానం వరకు వెళ్లగా సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని తెలియజేశారు. నరసరావుపేట ఎమ్మెల్యే తనకు కావలసిన వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఇలా రచ్చ చేయడంతో ఈ విషయం పైన సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లాగా పార్టీకి చెడ్డ పేరు ఎవరు తెచ్చినా సరే సహించమని, సస్పెండ్ చేస్తామంటూ తెలిపారు.