మేఘాంశ్ శ్రీహరి హీరోగా శ్రీ క్లింకార సెల్యులాయిడ్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ ‘ఆస్మాన్’ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

Reddy P Rajasekhar
శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా ‘ఆస్మాన్’ మూవీని కొండారు వెంకటేష్, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు. మేఘాంశ్ శ్రీహరి హీరోగా రానున్న ఈ చిత్రానికి రామ్ నందన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ నూతన చిత్ర ప్రారంభోత్సవాన్ని శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి సాయి దుర్గ తేజ్, సందీప్ కిషన్, విశ్వక్ సేన్, నిహారిక కొణిదెల, రోషన్ కనకాల, తిరువీర్, నార్నే నితిన్, రామ్ తాళ్లూరి తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి సాయి దుర్గ తేజ్ క్లాప్ కొట్టగా, సందీప్ కిషన్ స్విచ్ ఆన్ చేశారు. నిహారిక కొణిదెల స్క్రిప్ట్‌ని అందించగా.. తొలి సన్నివేశానికి రామ్ నందన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్ర ప్రారంభోత్సవంలో..

https://www.youtube.com/watch?v=1pLyRa7XWSw&list=PLv8tne3UD07NCqgp8gUI2WKmtGEBZSvNM

మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ.. ‘నా ‘ఆస్మాన్’ సినిమా ప్రారంభోత్సవంకి వచ్చిన సాయి అన్నకి, నిహారిక అక్కకి, సందీప్ అన్నకి అందరికీ థాంక్స్. నిర్మాతలు వెంకటేష్, శ్రీకాంత్ గార్లతో పని చేయడం ఆనందంగా ఉంది. రామ్ నందన్ ఓ అద్భుతమైన కథను చెప్పారు. మేం బ్లాక్ బస్టర్ కొట్టబోతోన్నాం. మిగిలిన వివరాలు మున్ముందు ప్రకటిస్తామ’ని అన్నారు.

డైరెక్టర్ రామ్ నందన్ మాట్లాడుతూ..  ‘తెలుగులో నాకు ‘ఆస్మాన్’ తొలి అవకాశం. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత వెంకటేష్ గారు, శ్రీకాంత్ గార్లకు థాంక్స్. మేఘాంశ్‌తో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. మూడు షెడ్యూల్స్‌లో సినిమాని పూర్తి చేస్తాం. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌తో రాబోతోన్నాం. ఇది చాలా కొత్తగా ఉంటుంది’ అని అన్నారు.

నిర్మాత శ్రీకాంత్ మన్నెం మాట్లాడుతూ.. ‘మా శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా రాబోతోన్న ఈ నూతన చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు. నా బ్రదర్ వెంకటేష్‌తో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాను. మేఘాంశ్ శ్రీహరితో మా తొలి సినిమాని చేస్తుండటం ఆనందంగా ఉంది. రామ్ నందన్ గారు ‘ఆస్మాన్’ అంటూ అద్భుతమైన కథతో సినిమాని తెరకెక్కించనున్నారు’ అని అన్నారు.

నిర్మాత వెంకటేష్ కొండారు మాట్లాడుతూ..  ‘మా తొలి చిత్రం ‘ఆస్మాన్’ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మూడేళ్ల క్రితం మా ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేశాం. అప్పటి నుంచీ కథలు వింటూనే ఉన్నాం. కోడి రామకృష్ణ గారి స్టూడెంట్ అయిన రామ్ నందన్ మాకు ఈ కథను ఏడాది క్రితం చెప్పారు. ఆయన ఇది వరకే అరబిక్‌లో సినిమా చేశారు. ఇక రామ్ నందన్ గారు చెప్పిన కథకి మేఘాంశ్ గారు సెట్ అవుతారని మేం ఆయన్ను సంప్రదించాం. మేఘాంశ్ గారికి కథ చాలా నచ్చింది. సస్పెన్స్, థ్రిల్లర్‌గా ఈ చిత్రం రాబోతోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తాం. మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామ’ని అన్నారు.

శోయభ్ మాట్లాడుతూ.. ‘నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత వెంకటేష్ గారు, శ్రీకాంత్ గార్లకు థాంక్స్. మేఘాంశ్‌తో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

తారాగణం : మేఘాంశ్ శ్రీహరి తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్: శ్రీ క్లింకార సెల్యులాయిడ్స్
నిర్మాతలు:  వెంక‌టేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: రామ్ నందన్
సి.ఇ.ఒ: స్వప్నకొండారు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రవీణ్ గుండ్ల‌తోటి
కెమెరామెన్ : షోయబ్
సంగీత దర్శకుడు: ప్రశాంత్ ఆర్ విహారి
ఆర్ట్ డైరెక్టర్ - కృష్ణ మోహన్ త‌ల్లూరి
పోస్టర్ డిజైనర్ - ధని ఏలే
పి.ఆర్‌.ఒ: ఎస్‌.కె.నాయుడు - ఫ‌ణి కందుకూరి (బియాండ్ కందుకూరి)
మార్కెటింగ్‌:  టికెట్ ఫ్యాక్ట‌రీ
ఈవెంట్స్‌:  యువి మీడియా

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: