ఫోన్ ఎక్కువగా చూస్తున్నారా? ఈ టెక్ నెక్ సమస్య గురించి తెలుసుకోండి?

సౌకర్యాలు పెరిగే కొద్దీ, టెక్నాలజీ పెరిగే కొద్దీ వాటి వల్ల వచ్చే సమస్యలు కూడా పెరుగుతుంటాయి. అయితే వీటి సమస్యకు కొద్ది పాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అలా కానీ పక్షంలో సమస్య ముదిరిపోయే ప్రమాదం ఉంది. సహజంగా ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లను గ్యాప్ లేకుండా వాడేవారికి మెడ కండరాలపై ఒత్తిడి ఉంటుంది. ఫలితంగా తీవ్రమైన నొప్పి పుడుతుంది. దీనినే టెక్ నెకట్ అని అంటారు.


అవును.. మెడ నొప్పికి ఆధునికంగా పెట్టిన పేరే టెక్ నెక్. నిరంతరం కంప్యూటర్ ముందు కూర్చొని పని చేసే వారికి ఈ తరహా నొప్పి వస్తుంది. ఎక్కువగా చదవడం, లేదా మొబైల్ స్ర్కీన్లు వైపు చూడటం వల్ల వెన్నెముక మీద పదే పదే ఒత్తిడికి గురవ్వడం వల్ల వస్తుంది  అదే పనిగా కంప్యూటర్ ముందు కూర్చొని స్మార్ట్ స్ర్కీన్ చూస్తున్పప్పుడు తల బరువుకు మెడ వెనుక కండరాల కుదించబడతాయి.


దీనివల్ల మెడ వెనుక కండరాలు మాత్రమే కాకుండా ఇంటర్ వెటెబ్రెరల్ డిస్కులు కూడా ఒత్తిడికి గురవుతాయంట. ఈ టెక్ నెక్ కారణంగా మెడ, భుజాల పై భాగంలో నొప్పితో పాటు విపరీతమైన తలనొప్పి, చేతులు తిమ్మిరి ఎక్కడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యను గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోని పక్షంలో వెన్నెముక వక్రత కోల్పోయే ప్రమాదం ఉంది.


కంప్యూటర్ తో పనిచేసేవారు నడుముకు అనుకూలమైన కుర్చీని ఏర్పాటు చేసుకోవాలి. ఇదే సమయంలో ముందుకు వంగి కూర్చోకుండా నిటారుగా కూర్చునేలా ఏర్పాటు చే’సుకోవాలి. ప్రతి గంటకు ఒకసారైనా విరామం తీసుకోవాలి. ఫలితంగా మెడపై ఒత్తిడి తగ్గుతుంది. రక్త ప్రసరణ కూడా సక్రమంగా ఉంటుంది. ఇక ఇప్పటికే ఈ సమస్యతో ఉన్నవారు ఫిజియోథెరఫిస్ట్ ను సంప్రదించి అవసరమైన మసాజ్‌లు చేయించుకుంటూ.. వ్యాయామాలు గురించి తెలుసుకొని అనుసరించాలి. స్మార్ట్ స్క్రీన్ ముందు గడిపే సమయాన్ని పరిమితం చేసుకోవాలి. కాని పక్షంలో గ్యాప్ తీసుకుంటూ పనిచేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: