ఈ కాయని చీప్ గా చూస్తున్నారా?.. కాళీ కడుపుతో ఒక కప్పు తిన్నారంటే డయాబెటిస్తో పాటు అనేక అనారోగ్య సమస్యలు పరార్..!

lakhmi saranya
చాలామంది బొప్పాయిని ఇష్టపడతారు. మరి కొంతమందికి మాత్రం బొప్పాయి అంటే అసలు ఇష్టం ఉండదు. బొప్పాయి తినటం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. బొప్పాయి పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు ఏడాది పొడవుగా దొరుకుతుంది... దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవటం ద్వారా అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. బొప్పాయిలో విటమిన్లు, ఖనిజాలతో పాటు పొటాషియం, ఫైబర్, ఫోలేట్ పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుంది.. ఖాళీ కడుపుతో ప్రతిరోజు ఒక కప్పు బొప్పాయి ముక్కలు తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి... ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే..
 శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి.... ఏమాతుంది... అనే విషయాలను తెలుసుకోండి. బొప్పాయి పండ్లను ఖాళీ కడుపుతో తింటే జీర్ణవ్యవస్థ బలపడటంతో పాటు పొట్ట సమస్యలను నివారిస్తుంది. ముఖ్యంగా మలబద్ధకంతో బాధపడే వారికి ఈ పండు చాలా మేలు చేస్తుంది. మలబద్ధకంతో బాధపడేవారు ఉదయాన్నే దీన్ని తీసుకోవాలి. ఫైబర్ పుష్కలంగా ఉన్నందున, ఇది పేగు కదలికలను సులభతరం చేస్తుంది. మలబద్ధకం నుండి ఉపశ్రమణాన్ని అందిస్తుంది. బొప్పాయిని ఖాళీ కడుపుతో తింటే అజీర్ణం, ఎసిడిటీ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.
బొప్పాయి లోనే పోషకాలు డెడె స్కిన్ ను తొలగించడంలో ప్రభావంతంగా పనిచేస్తాయి. ఇది మృతకణాలను తొలగిస్తుంది... తేమగా ఉంచుతుంది. రంధ్రాలను శుభ్రపరుస్తుంది... ఇంకా చర్మంపై ముడతలను నివారిస్తుంది. అంతేకాకుండా... చర్మం నిగారింపు కూడా పెరుగుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బొప్పాయి తీసుకోవటం వల్ల డయాబెటిక్ పేషంట్లకు మేలు జరుగుతుంది. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇంకా చెక్కెర తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిల్లో, ఖాళీ కడుపుతో ఈ పండును తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంతరించడానికి... స్థిరికరించడానికి సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండును ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: