బాడీ పాలిషింగ్ అంటే ఏంటి? ఎటువంటి బెనిఫిట్స్ పొందవచ్చు..?
ఈ పూర్తి శరీర చికిత్సను ఇంట్లో కూడా చేయవచ్చు. మృదువైన బాడీ బ్రష్ తీసుకోండి. చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడానికి వృత్తాకార కదలికలు సునీతంగ బ్రష్ చెయ్యండి. తడి చర్మం పై బాడీ స్క్రబ్ ని అప్లై చేయండి. మళ్లీ అలాగే ముప్పై సెకన్ల పాటు మసాజ్ చేస్తూ ఉండండి. తరువాత తేనె, పెరుగు, అలోవెరా జెల్ వంటి పదార్థాలను ఉపయోగించి హైడ్రేటింగ్ బాడీ మసాజ్ ను అప్లై చేయండి. 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచిన తరువాత శుభ్రం చేయండి. మీ శరీరానికి సరిగ్గా శుభ్రపరచడానికి గోరు వెచ్చని నీరు ఉపయోగించండి. స్నానం చేసేటప్పుడు...
చర్మపు తేమ సమతుల్యత కోసం తేలికపాటి, హైడ్రేటింగ్ షవర్ జల్ ఉపయోగించండి. స్నానం పూర్తయ్యాక బాదం నూనె లేదా కొబ్బరి నూనె వంటి బాడీ ఆయిల్ ను అప్లై చేయండి. ప్రేమను లాక్ చేయడానికి మీ చర్మం పై సునితంగా మసాజ్ చేయండి. బాడీ పాలిషింగ్ ముఖ్య ఉద్దేశం డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి స్మూత్ టెక్స్చర్ ఇవ్వడం. ఇది ఎక్స్ ఫోలియేటింగ్ స్క్రబ్ను ఉపయోగించటం ద్వారా చేయబడుతుంది. రక్త ప్రసన్నలో సహాయం చికిత్సలో వృత్తాకార పద్ధతిలో మసాజ్ చేయటం జరుగుతుంది. 2005లో స్పోర్ట్స్ మెడిసిన్ లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం... బాడీ మసాజ్ రక్తప్రసన్నను పెంచడం, కండరాల ఒత్తిడిని తగ్గించటం వంటి ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే శరీరాన్ని వృత్తాకార పద్ధతిలో మసాజ్ చేసినప్పుడు... పోషకాలు బాగా గ్రహించబడతాయి. చర్మ కారణాలకు రక్తప్రసరణ సరిగ్గా జరుతుంది.