చర్మానికి కొబ్బరి నూనె వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

lakhmi saranya
చాలామంది జుట్టుకు మాత్రమే కొబ్బరి నూనెని అప్లై చేస్తూ ఉంటారు . కొబ్బరి నూనె చర్మానికి కూడా చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది . దీనిని ప్రతిరోజూ ముఖానికి వాడడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి . ఈ నూనెలో ఉండే యాంటీ ఇన్ఫిలమెంటరీ గుణాలు మొటిమల నివారణ కు సహాయపడతాయి . చర్మాన్ని హానికరమైన సూక్ష జీవుల నుంచి రక్షిస్తాయి కూడా . దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి . అదేవిధంగా చర్మ మంటను తగ్గించడంలో కూడా కొబ్బరినూనె సహాయపడుతుంది ‌. చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి ఈ నూనె బాగా ఉపయోగపడుతుంది .

నల్ల మచ్చలను తగ్గించడంలో కూడా దామోదపడుతుంది కొబ్బరి నూనె . ఎన్నో ప్రయోజనాలు ఉన్న కొబ్బరి నూనె జుట్టుకు మాత్రమే కాకుండా మొహానికి కూడా అప్లై చేయడం ద్వారా ఈ బెనిఫిట్స్ ని మీ సొంతం చేసుకోవచ్చు . అదేవిధంగా కొబ్బరినూనె రాశి అనంతరం క్లీన్ చేసుకోవడం ద్వారా మొఖంపై పేరుకుపోయిన మురికి కూడా తొలగిపోతుంది . ఆడవారికి మాత్రమే కాదు మగవారికి కూడా తమ ముఖ సౌందర్యం అంటే ఎంతో ఇష్టం . అటువంటి వారికి ఈ కొబ్బరినూనె చాలా బాగా సహాయపడుతుంది అని చెప్పడంలో ఎటువంటి మొహమాటం లేదు . ఇన్ని ప్రయోజనాలు ఉన్న కొబ్బరి నూనె నీ ప్రతి రోజు కాకపోయినా వారానికి రెండు మూడు సార్లు ఫేస్ కి రాసి ఈ బెనిఫిట్స్ ని మీ సొంతం చేసుకోండి ‌.

ప్రజెంట్ నా జనరేషన్ లో దుమ్ము ధూళి ముఖానికి ఎక్కువగా పట్టేస్తుంది . దీనిని క్లీన్ చేయడం కోసం చాలామంది అనేక గ్రీన్స్ వాడుతూ ఉన్నారు . కానీ నేచురల్ పద్ధతిలో తయారయ్యే కొబ్బరి నూనెతో ఈ మురికిని ఈజీగా తరిమికొట్టవచ్చు . పూర్వకాలంలో వారంతా కొబ్బరి నూనెని ఎక్కువగా వాడేవారు . ప్రస్తుతం అంటే కొబ్బరి నూనె కొంటున్నాము కానీ .. పూర్వకాలం వారంతా స్వయంగా వారే కొబ్బరి ముక్కలను ఎండబెట్టి నూనె తయారు చేసుకునేవారు . అటువంటి సామర్థ్యం గలది కొబ్బరినూనె .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: