గుండెని ఆరోగ్యంగా ఉంచే మంచి అలవాటు ఇదే ?
మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడూ కూడా చాలా చురుకుగా ఇంకా ఎంతో ఉత్సాహంగా ఉండాలి. అందుకు నడక, యోగా, వ్యాయామం అనేవి బాగా ఉపయోగపడతాయి. ఇంకా అలాగే దీంతో పాటుగా కొన్ని చిన్న అలవాట్లు కూడా మన గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక ఈ అలవాట్లలో ఒకటి మెట్లు ఎక్కడం.. మెట్లు ఎక్కడం ఆరోగ్యానికి చాలా మంచిది. గుండెని ఆరోగ్యంగా ఉంచే మంచి అలవాటు ఇదే .. ఎందుకంటే దీని వల్ల అది మీ కండరాలను బలోపేతం చేయడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా గుండెపోటు లాంటి ప్రమాదకరమైన సమస్య నుంచి కూడా బయటపడేలా చేస్తుంది.. అయితే గుండె బలంగా ఉండటానికి గుండెపోటును నివారించడానికి ఉత్తమ మార్గం ఏంటంటే ప్రతిరోజూ మెట్లు ఎక్కడం.. అయితే..ప్రతి రోజూ ఎన్ని మెట్లు ఎక్కాలి..? ఇంకా అధ్యయనం ఏం చెప్పింది..? అంటే.
గుండెపోటును నివారించడానికి సరైన మార్గం.. ప్రతిరోజూ మెట్లు ఎక్కడం చాలా మంచిదట. ఈ అలవాటు ద్వారా గుండె సిరలు బలంగా మారడం ప్రారంభమవుతుందని అధ్యయనం పేర్కొంది. తులనే విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం.. తెలిసిన విషయం ఏమిటంటే ప్రతిరోజూ కూడా 50 మెట్లు ఎక్కడం గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. మెట్లు ఎక్కే వారికి ఇతరులతో పోలిస్తే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 20 శాతం తక్కువ ఉంటుందట. జిమ్‌కి వెళ్లడానికి లేదా ఎక్కువసేపు నడవడానికి మీకు సమయం దొరకకపోయినా ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని ఈ అధ్యయనం స్పష్టంగా సూచిస్తుంది.ఇలా మీరు మెట్లు ఎక్కుతూ కూడా సులభమైన మార్గాల్లో మీ హృదయాన్ని భద్రంగా చూసుకోవచ్చని పరిశోధనలో తెలిపింది. కాబట్టి కచ్చితంగా ఈ అలవాటుని డైలీ పాటించండి. కచ్చితంగా ఎంతో ఆరోగ్యంగా బలంగా ఉంటారు.