గ్యాస్ త్వరగా అయిపోకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి..?

lakhmi saranya
చాలామందికి గ్యాస్ బండ త్వరగా అయిపోతుంది. ఇలా వేయగానే అలా గ్యాస్ అనేది అయిపోతుంది. గ్యాస్ త్వరగా అయిపోకుండా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించండి! భారతదేశంలో దాదాపు ప్రతి ఇంట్లో ప్రజలు సిలిండర్ ఉపయోగిస్తూ ఉంటారు. వంట కోసం, గిజర్లకు గ్యాస్ ఉపయోగపడుతుంది. అటువంటి పరిస్థితుల్లో, సిలిండర్ త్వరగా అయిపోకుండా ఉండటానికి కొన్ని చిట్కాలను పాటించవచ్చు. దీంతో ఎక్కువ కాలం ఉంటుంది.

మీ ఇంట్లో వంట కోసం వాడుతున్న గ్యాస్ సిలిండర్ను ఎప్పటికప్పుడు తనకి చేయండి . అది లీక్ అవుతుందో లేదో చూడండి . వంట సిలిండర్ చెక్ చేసినప్పుడు గ్యాస్ లీక్ అవుతున్నట్లు మీకు అనిపిస్తే , రెగ్యులేటర్ తో దాన్ని ఆపేయండి . మీ సిలిండర్ను సరిగ్గా ఉపయోగించండి . బర్నర్ ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి . అప్పుడు ఎక్కువ రోజులు వస్తుంది . మీ ఇంట్లో మీరు ఉపయోగిస్తున్న సిలిండర్ లో తక్కువ గ్యాస్ ఉంటే , దానిపై తడి పాత్రలను ఎప్పుడూ ఉపయోగించవద్దు . ఇంట్లో గ్యాస్ స్టవ్ పై కూరగాయలు లేదా ఏదైనా తయారు చేసేటప్పుడు ఎల్లప్పుడూ వాటిపై మూత పెట్టి కవర్ చేయండి . అవసరమైనప్పుడు మాత్రమే గ్యాస్ వెలిగించి పెట్టుకోండి .

వంట చేసే సమయంలో అన్ని వస్తువులు దగ్గర పెట్టుకుని వంట ప్రారంభించారు . వస్తువులన్నీ దగ్గర పెట్టుకుని వంట మొదలుపెడితే గ్యాస్ అనేది అసలు అవ్వదు . లేదంటే వంట సరుకులు తెచ్చుకోకుండా గ్యాస్ దగ్గర కూర్చుంటే గ్యాస్ అనేది ఎక్కువగా అయిపోతుంది . ఎందుకంటే .. మనం వంట సామానం తెచ్చుకోకుండా కూర్చుంటే అవి తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు గ్యాస్ అనేది ఎక్కువ అవుతుంది . కాబట్టి గ్యాస్ త్వరగా అయిపోతుంది. అందుకని మనం గ్యాస్ మీద ఏ పని చేయాలనుకున్నా దగ్గర పెట్టుకుని చేయాలి. లేదంటే గ్యాస్ అనేది ఎక్కువగా ఖర్చవుతూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: