పరగడుపున కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

lakhmi saranya
మనలో చాలామందికి కరివేపాకు అంటే అసలు ఇష్టం ఉండదు. దానిని చూస్తేనే అసహ్యించుకుంటారు. కానీ కరివేపాకులో మాత్రం చాలా ఆరోగ్యకరమైన లక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది మంచి డేస్ట్ ను, వాసనను ఇస్తోంది. కానీ కరివేపాకు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అవును మీరు కనుక రోజు పరగడుపున కరివేపాకు రసం తాగితే చాలా మంచిది. మనం తినే కూరల్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకులు కచ్చితంగా ఉంటాయి.

అయితే చాలామంది వీటిని కేవలం డేస్ట్, మంచి వాసన కోసమే చేస్తారు. ఈ కరివేపాకు జ్యూస్ లో ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉండే కరివేపాకు బరువును తగ్గించటం లో సహాయపడుతుంది. శరీరంలో రక్తాన్ని పెంచడం వారుకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. అసలు కరివేపాకు రసాన్ని తాగటం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. కరివేపాకు లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ డయాబెటిక్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలో విటమిన్ బి2, విటమిన్ బి1, విటమిన్ ఎ, ఐరన్, క్యాల్షియం, ప్రోటీన్ వంటి పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంచుతాయి.

మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. డయాబెటిస్ పేషంట్లకు కరివేపాకు రసం ఒక మెడిసిన్ ల పని చేస్తుంది. అవును దీనిలో ఉండే హైపోగ్లైసిమిక్ లక్షణాలు బ్లడ్ షుగర్ లెవల్స్ ను నియంతరిస్తాయి. అలాగే ఈ రసంలో ఉండే ఫైబర్ కంటెంట్ మీ శరీరంలో ఇన్సులిన్ స్పైక్ లను నివారించడానికి బాగా సహాయపడుతుంది. ఆడవాళ్లకు రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్లు ఉదయమునే పరగడుపున కరివేపాకు రసం తాగితే హెమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. కరివేపాకులో ఐరన్ మెండుగా ఉంటుంది. ఇది మీ శరీరంలో రక్తం లోపాన్ని తగ్గిస్తుంది. అలసట, బలహీనత వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: