రాత్రి భోజనం ఆలస్యంగా తినడం వల్ల.. ఏమవుతుందో తెలుసా..?

lakhmi saranya
చాలామందిలో భోజనం రాత్రి ఆలస్యంగా తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది. మరికొంతమంది త్వరగా భోజనం చేసేస్తారు. త్వరగా భోజనం చేయటం అనేది చాలా మంచి విషయం. రాత్రి లేటుగా భోజనం తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి రాత్రి భోజనం వీలైనంత తొందరగా తినేయాలి. ఆలస్యంగా రాత్రి భోజనం చేయొద్దని...ముఖ్యంగా కొవ్వులు, చక్కెరతో కూడిన ఆహారం ఎక్కువగా తినొద్దని నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇదేంత ముఖ్యమో మరోసారి రుజువైంది. పట్టుకోవటానికి 3 గంటల లోపు భోజనం చేసేవారిలో (వారానికి కనీసం నాలుగు రోజుల పాటు) పెద్ద పేగు చివర (కోలోరెక్టల్) క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతున్నట్లు తాజాగా బయటపడింది.

రాత్రి భోజనాన్ని పెందలాడే తినే వారితో పోలిస్తే ఆలస్యంగా తినేవారికి చిన్న కణితి ( అడినోమా) ఏర్పడే అవకాశం 46 పర్సంటేజ్ తక్కువగా ఉంటున్నట్టు షికాగోలోని రష్ యూనివర్సిటి పరిశోధకులు గుర్తించారు. వీరిలో మూడు కన్నా ఎక్కువ కణితులు వలెత్తే ముప్పు 5.5 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. నిజానికి ఇలాంటి కణితులు క్యాన్సర్ రహితమే. కానీ వీటిలో కొన్ని క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉంది. జీర్ణకోశంలో ఇవి ఉన్నచోటు, సైజును బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఇంతకీ పెద్దపేగు క్యాన్సర్ కు ఆలస్యంగా భోజనం చేయడానికి మధ్య సంబంధమేమిటి? జీర్ణ కోశంలోని జివగడియారం గతి తప్పటమేనని పరిశోధకులు భావిస్తున్నారు.

ఆలస్యంగా భోజనం చేసినప్పుడు మెదడు అది రాత్రి సమయమని, ఇక పేగులేమో పగలని అనుకుంటామని చెబుతున్నారు. పైగా ఆలస్యంగా భోజనం చేసేవారు చాలా సార్లు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోరు. కొవ్వు, చక్కెర అధికంగా ఉన్న పదార్థాలు తింటుంటారు. ఇది పేగులలోని జీవగడియారాన్ని అస్తవ్యస్తం చేయటమే కాదు, బరువు పెరగటానికి దారితీస్తుంది. ఇది క్యాన్సర్ ముప్పును పెంచుతుంది. పేగుల్లోని కొన్ని బ్యాక్టిరియాకు తమవైన జీవగడియారాలుంటాయి. ఇవి రోజువారి లయను అనుసరిస్తాయి. తినే ఆహారాన్ని బట్టి కొన్ని రకాల బ్యాక్టీరియా మరింత చురుకుగా వ్యవహరిస్తోంది. కొవ్వు, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలను ఆలస్యంగా తిన్నప్పుడు వీటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: