వర్షాకాలంలో పిల్లలు తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..!

lakhmi saranya
వర్షాకాలం వచ్చేసింది కదా! కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే..పిల్లలు వర్షంలో తడవటం వల్ల జలుబు లేదా దగ్గు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. పిల్లలకే అనే కాదు పెద్ద వాళ్ళకి కూడా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి వర్షాకాలంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు చిన్నారులను చాలా ఇబ్బందికి గురిచేస్తాయి. అందుకే ఈ కాలంలో పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. అందుకే వారి ఆరోగ్యం కోసం పాటించాల్సిన చిట్కాల గురించి తెలుసుకుందాం. ఈ కాలంలో పిల్లలు శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

స్నానానికి ముందు నూనెతో మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో స్నానం చేయించండి. పొడి బట్టలను మాత్రమే వేయండి. పిల్లల గదిని శుభ్రపరచటం ముఖ్యం. దోమలు, క్రిములు, బ్యాక్టీరియా, బొద్దింకలు వారి గదిలో లేకుండా చూసుకోండి. వర్షాకాలంలో చిన్నారులకు జంక్ ఫుడ్ అసలు ఇవ్వకండి. ఆకుకూరలు, పండ్లు, పాలు పిల్లల ఆరోగ్యంలో ఉండేలా చూసుకోండి. మంచి నీటితో కడిగిన తరువాతే పండ్లను పిల్లలకు ఇవ్వండి. వాష్ చెయ్యకుండా పండ్లను అందించడంతో వాటిపై మురికి పలు సమస్యలకు కారణం అవుతుంది. ఈ కాలంలో చిన్నారులకు కాటన్ దుస్తులను మాత్రమే ఎక్కువగా ఇవ్వండి. దోమల బెడద లేకుండా ఉండే దుస్తులను ఉపయోగించండి.

వర్షాకాలం వచ్చే సమయానికి వారికి కాలానుగుణంగా వేసే అన్ని వ్యాక్సిన్లు పూర్తి అయ్యేలా చూసుకోండి. పిల్లలకు వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే తాగటానికి ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో నిల్వ ఉన్న నీరును వారిదరిచేయనీకండి. పిల్లలు బయట నుంచి వచ్చేటప్పుడు కచ్చితంగా కాళ్ళను కడగటం అలవాటు చేసుకోవాలి. ఈ వర్షాకాలంలో పైన చెప్పిన విధంగా చేయటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. పిల్లలు అనారోగ్యం పాలవ్వకుండా ఉంటారు. వర్షాకాలంలో బయటకు అస్సలు పంపించకండి పిల్లలని. దోమలు కుట్టడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. కాబట్టి దోమలు ఉన్న చోటకి పిల్లలని మాత్రం అసలు తీసుకెళ్లవద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: