వసతో ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు?

Purushottham Vinay

వస వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఆరోగ్యానికి మేలు చేసే వసలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. మీరు కానీ అధిక కొవ్వు పెరిగి దానితో ఇబ్బంది పడుతుంటే ఒక టీస్పూన్‌ వస చూర్ణం, ఒక టీ స్పూన్ త్రిఫల చూర్ణం వేసి కొంచెం నీరు వేసి పేస్ట్ గా చేయాలి. ఈ మిశ్రమాన్ని కొవ్వు ఉన్న పొట్ట మీద, తొడలపై మీరు అప్లై చేయాలి. ఇలా చేయడం వలన కొవ్వు ఈజీగా కరుగుతుంది. అలాగే మొలలతో ఇబ్బంది పడుతుంటే ముందుగా నువ్వుల నూనేను వేడి చేసి ఆ మొలల మీద అప్లై చేసి.. తర్వాత వస కొమ్ములను, సోంపుని కలిపి నూరి ఆ మిశ్రమాన్ని మొలలకు అప్లై చేయాలి. ఇలా చేయడం వలన మొలల నుంచి ఈజీగా ఉపశమనం లభిస్తుంది.వస నూనెలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి రాస్తుంటే కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంకా అలాగే గాయాలు, పుండ్లతో ఇబ్బంది పడుంటే వాటిని వేడి నీరుతో శుభ్రం చేసి తర్వాత వస కొమ్ముని వేసి కాచిన నీటితో మళ్ళీ శుభ్రం చేయాలి.


జుట్టు కనుక ఊడిపోతుంటే వసకొమ్ము, దేవదారు వేరు లేదా గురవింద గింజలను ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని జుట్టు ఊడిన చోట అప్లై చేస్తే జుట్టు పెరుగుతుంది. అలాగే మీరు అసిడిటీ సమస్యతో ఇబ్బంది పడేవారు వస చూర్ణాన్ని తేనె, బెల్లంతో కలిపి తీసుకోవడం వలన అసిడిటీ సమస్య నుంచి బయటపడతారు. మీరు కనుక అప్పుడప్పుడు మూర్చ వ్యాధితో ఇబ్బంది పడుతుంటే వసకొమ్ము పొడిని తేనెతో కలిపి తీసుకోవడం వలన మూర్చ వ్యాధి క్రమంగా తగ్గుముఖం పడుతుంది.జీర్ణాశయ సంబధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నా.. అల్సర్లకు, గ్యాస్‌, అసిడిటీ సమస్యలతో పాటు విరేచనాలు, చర్మ సమస్యలకు వస తో చెక్ పెట్టవచ్చు.అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారికి వస చూర్ణం మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఆందోళన, ఒత్తిడితో పాటు జ్ఞాపక శక్తి తగ్గుతుంటే పస బెస్ట్ మెడిసిన్. అంతేకాదు మూత్రపిండాలలోని రాళ్ల నుంచి ఉపశమనం ఇస్తుంది. నాడీ మండల వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.వస వలన జీర్ణ సమస్యలు, శరీర వాపులు, నొప్పులు, అధిక కొవ్వు వంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: