మధ్యాహ్నం భోజనం అనంతరం నిద్రిస్తున్నారా?.. తస్మాత్ జాగ్రత్త..!

lakhmi saranya
చాలామంది మధ్యాహ్నం భోజనం చేశాక పడుకుంటారు. మరికొంతమందికి మధ్యాహ్నం నిద్ర అనేదే రాదు. మధ్యాహ్నం భోజనం చేశాక నిద్రవస్తుందా.. తస్మాత్ జాగ్రత్త! మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొంతమందికి నిద్రపోయే అలవాటు ఉంటుంది. అయితే..ఇలా పడుకోవటం శరీరానికి అంతా మంచిది కాదు. ఫుడ్ తిన్నాక బాడీ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ ప్రారంభమై, పేగులకి రక్తం సరఫరా అయ్యి, నిద్రలోకి జారుకుంటారు. ఇలా పడుకుంటే కడుపు బరువుగా అనిపిస్తుంది. దీనికి తోడు జీర్ణ క్రియ సమస్యలోస్తాయి. గుండెల్లో మంట, ఛాతిలో వెనుక నొప్పి వంటివి వస్తాయి.

తిన్న వెంటనే పడుకోవటం వల్ల ఊబకాయ వస్తుంది. కేలరీలు బర్న్ అవ్వవు కాబట్టి..శరీర బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. కడుపు నిండా తిన్న తరువాత నిద్రలోకి జారుకుంటే..గ్యాస్టిక్ సమస్యలు వస్తాయి. ఫలితంగా..నిద్రలేమీ బారిన పడతారు. రాత్రుళ్లు సరిగ్గా నిద్రపోలేరు. ఇలాంటి సమస్యలు రాకుడదంటే...తిన్న వెంటనే పడుకోవద్దు. కొద్దిసేపు గ్యాప్ ఇవ్వాలి. ఆ తరువాత పడుకుంటే..కేవలం గంట మాత్రమే నిద్రపోవాలి. అలాగే..ప్రోటీన్స్, కార్బోహైడ్రేక్స్, పీచుతో కూడిన ఫుడ్స్ తీసుకుంటే ఉత్తమం. ఇవి రక్తస్థాయిల్ని బ్యాలెన్స్ అయి, రాత్రిళ్లలో మంచి నిద్ర ప్రోత్సాహిస్తాయి. మధ్యాహ్నం భోజనం తిన్నా వెంటనే పడుకోవద్దు.

ఎందుకంటే బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గ్యాస్ ప్రాబ్లం వంటి సమస్యలు కూడా వస్తాయి. జ్వరం ఉన్నవాళ్లు భోజనం చేసిన తర్వాత పడుకుంటే వెంటనే జ్వరం అనేది పెరుగుతుంది. కాబట్టి ఎవరికైనా జ్వరం ఉంటే మధ్యాహ్నం తిన్నా వెంటనే అస్సలు పడుకోకండి. ఈరోజుల్లో అందరికీ గ్యాస్ సమస్యలే వస్తున్నాయి. ఎందుకంటే మధ్యాహ్నం తినేసి పడుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ మరింత పెరుగుతుంది. కాబట్టి ఎవరైనా గాని మధ్యాహ్నం తిన్నా వెంటనే మాత్రం అస్సలు నిద్రపోవద్దు. పైన చెప్పిన విధంగా ఫాలో అవ్వండి. భోజనం చేశాక కొంచెం గ్యాప్ ఇచ్చి నిద్రపోతే ఆరోగ్యం బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: