మొక్కజొన్న పొత్తుతో ఆరోగ్యానికి ఎన్ని అద్భుతమైన లాభాలో తెలుసా?

Purushottham Vinay

చల్లటి వాతావరణంలో మొక్క జొన్న కంకులను వేడిచేసి, వాటిపై నిమ్మరసం పూసి, ఉప్పు, కారం చల్లి తింటుంటే అమృతంలా ఉంటుంది. అయితే ఇవి కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మరి వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.అనేక యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలతో పాటు మొక్కజొన్నలో విటమిన్ ఎ, విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే తరచుగా తినడంవల్ల స్కిన్ అలెర్జీలు తగ్గుతాయని, స్కిన్ గ్లో పెరుగుతుందని పోషకాహార నిపుణులు చెప్తుంటారు. అలాగే ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్లు కలిగి ఉండటంవల్ల మొక్క జొన్న ఎముకల బలానికి కూడా మంచిది. వర్షాకాలంలో కీళ్లు, ఒళ్లు నొప్పులతో ఇబ్బంది పడేవారు మొక్కజొన్న కంకులను తినడంవల్ల చాలా రకాలుగా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇక కాల్చిన మొక్క జొన్నలో ఫైబర్ కంటెంట్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు విరివిగా ఉంటాయి. 


విటమిన్ సి, బయో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ వంటి లక్షణాలు ఉండటంవల్ల అవి శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను ఈజీగా నివారిస్తాయి. దాని ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉన్నందువల్ల మొక్కజొన్న కంటి సమస్యలను దూరం చేస్తుంది. దీన్ని డైట్‌లో భాగంగా తీసుకోవడంవల్ల దృష్టిలోపాలు రాకుండా ఉంటాయి. కాబట్టి పిల్లలు, పెద్దలు ఖచ్చితంగా వీటిని తినాలని పోషకాహార నిపుణులు చెప్తుంటారు. వీటిలో ఫైబర్ కంటెంట్ ఉండటంవల్ల మొక్క జొన్న జీర్ణ సమస్యలను నివారిస్తుంది.ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అయితే పచ్చివి తినడంవల్ల ఈ పోషకాలు లభించే అవకాశం చాలా తక్కువ. కాబట్టి వాటిని కాల్చి లేదా ఉడకబెట్టి తింటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఇక మొక్క జొన్నలో ఆరోగ్యానికి అవసరమైన చాలా పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలతోపాటు విటమిన్ బి కాంప్లెక్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి వాటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే ఖచ్చితంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: