ఆకాశంలో ఆ వింతలు.. మనకు ఏదో రహస్యం చెబుతున్నాయా?

ఉల్కాపాతం.. ప్రకృతి మనకు చూపించే అద్భుత దృశ్యాల్లో ఇదీ ఒకటి. అతరిక్షంలో ఉండే చిన్న చిన్న శిలలు భూ వాతావరణంలో ప్రవేశించేటప్పుడు తీవ్ర ఒత్తిడికి గురై మండిపోతాయి. ఈ క్రమంలో వెలువడే కాంతిలో అవి తారాజువ్వాల్లా నేలవైపు దూసుకొస్తూ ఆశ్చర్యం కలగజేస్థాయి. ఈ అద్భుతాన్ని విశ్లేషించేందుకు భాష సరిపోదు. ఇక రంగురంగుల్లో ఉల్కాపాతం జరిగితే ఆ దృశ్యం చూసి మురిసిపోవాల్సిందే. సరిగ్గా ఇలాంటి దృశ్యమే…

స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో గగనతలంపై ఆవిష్క్కతమైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసి జనాలు మైమరచిపోతున్నారు. ఉల్కాపాతం జరగొచ్చని శాస్త్ర వేత్తలు పేర్కొన్న కొద్ది రోజులకే స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో ఉల్కాపాతం జరిగింది. చిన్న చిన్న గ్రహ శకలాలు ఒక్కసారిగా భూమివైపు దూసుకొచ్చాయి. భూ వాతావరణంలోకి ప్రవేశించాక ఆకు పచ్చ రంగులో మండిపతూ ఆకాశంలో అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించాయి. ఇవి ఆకాశంలోనే మండిపోయాయా లేక నేలను తాకాయా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

అయితే నీలం, ఆకుపచ్చ కలగలపిన రంగులో మండుతూ ఆకాశంలో అద్భుత కాంతిని వెదజల్లే వీటి దృశ్యాలు మాత్రం జనాల్ని మైమరిపింపజేస్తున్నాయి. ఇలాంటి కాంతిలో ఉల్కాపాతం ఎప్పుడూ చూడలేదని జనాలు అనేక మంది కామెంట్ చేస్తున్నారు.  ఈ నీలిరంగు ఉల్క భూమిపై పడినప్పుడు.. ఆ సమయంలో వచ్చిన వెలుగు పగలును తలపించింది.

ఈ వెలుగు కొన్ని వందల కిలోమీటర్లు దూరం నుంచి కనిపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది క్యాస్ర్టో డైరో ప్రాంతంలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన వివరాలు అయితే పూర్తిగా బయటకు రాలేదు. కానీ దీనికి సంబంధించిన వీడియోలు మాత్రం వైరల్ గా మారాయి. 2013లో కూడా రష్యాలోని చెల్యాబిన్క్స్ అనే ప్రాంతంలో ఇంతకంటే పెద్ద స్థాయిలో ఉల్కలు పడ్డాయి. అప్పట్లో ఆ ఉల్కలు భారీగానే  ఉన్నాయని శాస్త్రవేత్తలు అంగీకరించారు. అది 500 కిలో టన్నుల టీఎన్జీటీకి సమానమైన శక్తిని విడుదల చేసిందని అంచనా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

sky

సంబంధిత వార్తలు: