మామిడి పండ్లకు.. మ్యాంగో అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?

praveen
వేసవికాలం వచ్చింది అంటే చాలు అందరికీ గుర్తుకు వచ్చేది మామిడి పండ్లు. సమ్మర్ అనేది మామిడి పండ్ల సీజన్ గా పిలుచుకుంటూ ఉంటారు. ఇక సమ్మర్లో ఎక్కడ చూసినా కూడా రోడ్లపైన మామిడి పండ్ల దుకాణాలు దర్శనమిస్తూ ఉంటాయి. నిగనిగలాడిపోయే మామిడి పండ్లను తినాలని ప్రతి ఒక్కరు కూడా తెగ ఆరాటపడుతూ ఉంటారు అని చెప్పాలి. ఎంతో టేస్టీగా ఉండే మామిడి పండ్లను తినడం ద్వారా సంతృప్తిని పొందుతూ ఉంటారు.

 అయితే మామిడి పండ్లను  ఇంగ్లీషులో మ్యాంగో అని పిలుస్తూ ఉంటారు. ఇలా తెలుగులో ఒకలా పిలుచుకునే పండుని ఇంగ్లీష్ లో మరోలా పిలుచుకోవడం చూస్తూ ఉంటాం. అయితే ఇలా ఇంగ్లీషులో ఆ పేరు రావడానికి గల కారణం ఏంటి అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. అలాగే ఇంగ్లీష్ లో మామిడిపండును మ్యాంగో అని ఎందుకు పిలుస్తారు అనే డౌట్ చాలామందికి వచ్చే ఉంటుంది. అయితే ఇలా మామిడిపండుకు మాంగో అని పేరు రావడం వెనక ఒక పెద్ద స్టోరీనే ఉందట. ఏకంగా ఈ మామిడి పండ్లకు 500 ఏళ్ల చరిత్ర ఉంది అని అంటున్నారు నిపుణులు. అయితే మ్యాంగో అనే పేరు పోర్చుగీస్ పదం నుండి వచ్చిందట.

 మొదట మామిడి పండ్లను మ్యాంగో అని కాకుండా మాంగా అని పిలిచేవారట ఆ దేశస్తులు. 1498లో సుగంధ ద్రవ్యాల వ్యాపారం కోసం కేరళకు వచ్చేవారట. ఇక అక్కడ మామిడి పండ్లను మన్నా అనేవారు. ఆ పేరు పలికేందుకు కాస్త కష్టంగా ఉండడంతో మాంగా అని పిలవడం మొదలుపెట్టారట. ఇక అలా అలా పిలుస్తూ పిలుస్తూ మాంగా పేరు కాస్త మ్యాంగో పేరుగా మారిపోయిందట. ఇకపోతే ప్రపంచంలో సగానికి పైగా మన దేశమే మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తుంది అని చెప్పాలి. కాగా వేసవిలో మామిడి పండ్లను తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: