అరటిపండు కేక్.. టేస్టీ అండ్ హెల్తీ?

Purushottham Vinay
అరటిపండుని ఎక్కువగా తింటూ ఉంటాం.పచ్చి అరటి కాయ అయితే వేపుడులు చేసుకుంటాం.అరటిపండు ని కొన్ని కేక్స్ లలో వాడతారు.మరి అలాంటి కేక్సలలో కొత్త రకం కేక్ గురించి ఇప్పుడు మనం తెలుస్తుంది.బాగా పండిన అరటిపండ్లు తీసుకొని తొక్క తీసి రౌండ్ గా కట్ చేసుకొని పక్కన పెట్టుకొండి.ఒక గిన్నెలో నాలుగు కోడిగుడ్లులో పచ్చ సొన మాత్రమే తీసుకుని బాగా కలిసే వరకు కలుపుకోవాలి.మిగిలిన తెల్ల సొనని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.తర్వాత తరిగిపెట్టుకున్న అరటిపండు ముక్కలు మిక్సీ వేసి పేస్ట్ ల చేసుకోవాలి. తర్వాత ఈ అరటిపండు పేస్ట్ ని గుడ్డు పచ్చసొన లో  వేసి బాగా కాలపాలి.ఇందులోనే చెంచా వెన్నెలా ఆరు చెంచాల పాలు కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.ఇక ఇందులోనే ఆరు టేబుల్ స్పూన్ ల గోధుమపిండి,చిటికెడు ఉప్పు,అర చెంచా,బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి.తరువాత ఫ్రిజ్ లో పెట్టుకున్న గుడ్డు తెల్ల సొనని ఒక గిన్నెలోకి తీసుకుని రెండు నిముషాలు బాగా నురుగు వచ్చే వరకు గిలకొట్టుకోవాలి.


తర్వాత ఐదు చెంచాల పంచదారని కొంచం కొంచెం వేసుకుంటూ గిలకొట్టుకుంటూ కలపాలి.ఇలా చేస్తూ ఉంటే మంచి క్రీం లా తయారవుతుంది.ఇలా తయారైనా క్రీమ్ ని ముందుగా చేసిపెట్టుకున్న బనాన మిశ్రమం లో వేసి రెండు బాగా కలపాలి.ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి దానికి మొత్తం నూనే రాసి,ఈ కలిపి పెట్టుకున్న గుడ్డు బనాన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ఇడ్లీ ల్లా వేసుకుని,పాన్ లో అటు ఇటు ఒక రెండు చెంచాల వాటర్ వేసి మూత పెట్టుకోవాలి.రెండు నిముషాలు తరువాత మరో రెండు చెంచాలు నీళ్లు పోసి మూత పెట్టుకోవాలి.ఒకవైపు బాగా ఎరుపు రంగు వచ్చాక ఇంకో వైపు కూడా సేమ్ ఇలాగే రెండు చెంచాల నీళ్లు పోస్తూ ఎర్రగా రంగు మారే వరకు మూత పెట్టుకోవాలి.రెండు పక్కలా బాగా కాల్చుకున్నాక ఒక గున్నెలోకి వీటిని తీసుకోవాలి అంతే కేక్ రెడీ వీటికి కించెం నెయ్యి రాసి తింటే చాలా రుచిగా ఉంటుంది.పైగా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: