చపాతీ తినేటప్పుడు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి?

Purushottham Vinay
మన ఇండియాలో ఎక్కువగా తినే ఆహారాలలో చపాతీ ఒకటి.ఈ రోజుల్లో కేవలం నార్త్ ఇండియన్స్ మాత్రమే కాదు సౌత్ ఇండియన్స్ కూడా చపాతిలు ఎక్కువ తింటున్నారు.ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలు చపాతీ తినే వారు కూడా ఉన్నారు. అయితే, రాత్రి పూట అన్నం తినడానికి ఇష్టపడని వారు చపాతీకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు.చాలా మంది చపాతీ ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ అలా అస్సలు తినకూడదు.ఎందుకంటే చపాతి తినడానికి ఒక ప్రత్యేక సమయం ఉంది. చపాతీల్లో క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట చపాతీ తింటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. రాత్రిపూట చపాతీలు తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. కాబట్టి రాత్రిపూట చపాతీ తినకూడదు. అలాగే మధ్యాహ్నం పూట చపాతీ తినడం శరీరానికి మేలు చేస్తుంది. అలాగే రోజూ టైమ్‌ ప్రకారం రాత్రివేళ చపాతీలు తినాలి. రాత్రి 7 తర్వాత 10లోపే తింటే ఎంతో ఆరోగ్యం అంటున్నారు నిపుణులు. ఉదయం వేళ కూడా చపాతీలు తంటే మంచిదే.చపాతీ ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది అధిక రక్తపోటు సమస్యకు దారి తీస్తుంది. రాత్రిపూట చపాతీ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.


మధుమేహం, పిసిఒడితో బాధపడుతున్న రోగులకు రాత్రిపూట చపాతీ తినడం పెద్ద సమస్యగా మారుతుంది. రోటీ రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. రక్తంలో చక్కెర పెరుగుదల శరీరంలోని ఇతర భాగాలపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.చపాతీలో 120 కేలరీలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉదయం పూట మహిళలు రెండు చపాతీలు, పురుషులు మూడు చపాతీలు మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రాత్రి భోజన సమయంలో మీరు మీ అవసరాన్ని బట్టి తినవచ్చు. అయితే 3 లేదా 4 చపాతీల కంటే ఎక్కువ తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. అయితే, బరువు తగ్గాలని ప్రయత్నించే వారు చపాతీని తగ్గించుకోవాలి. గోధుమ చపాతీ తినడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్లు, గ్లూటెన్ పరిమాణం పెరిగి కొవ్వు పేరుకుపోతుంది. చపాతీ శరీరానికి శక్తిని ఇస్తుంది. చపాతి పూర్తిగా వదులుకునే బదులు మితంగా తినడం మంచిది. కాబట్టి ఖచ్చితంగా పైన తెలిపిన విధంగా చపాతిని తినండి. ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: