వీటిపై టాయిలెట్ కన్నా ఎక్కువ క్రిములు కలిగి ఉంటాయని మీకు తెలుసా..?

Divya
సాధారణంగా మన దేశంలో కచ్చితంగా ముఖము,కాళ్లు,చేతులు కడుక్కున్న తరువాతే,ఆహారం పెట్టడానికి పెద్దలు ముగుస్తారు.వీటిపై తల్లులు కూడా ఆంక్షలు పెట్టి,పిల్లలకు మంచిహ్యాబిట్స్ అంటూ నేర్పిస్తూ ఉంటారు.కానీ కొన్ని రకాల వస్తువులు టాయిలెట్ సీట్ కన్నా ఎక్కువ జంమ్స్ ని కలిగి ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.అంతేకాక వీటిని తాకకుండా ఒక్క రోజు కూడా గడవదట.ఈ వస్తువులను సంవత్సరాల పాటు ఎలాంటి క్లీనింగ్ ప్రాసెస్ చేయకుండా వాడుతూ ఉండడం వల్లే ఇలా జరుగుతుందని చెబుతున్నాయి.అసలు ఆ వస్తువులేంటో,వాటిని ఎలా శుభ్రం చేసుకోవాలో మనము తెలుసుకుందాం పదండి..
మొబైల్..
మొబైల్ లేనిదే రోజులు గడవని కాలంలో ఉన్నాము. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు పదేపదే టచ్ చేసే పరికరాలలో మొబైల్ ప్రథమ స్థానంలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.కానీ ఈ మొబైల్ పై టాయిలెట్ సీట్ కన్నా ఎక్కువ జేమ్స్ కలిగి ఉంటాయని,వీటిని ఇలాగే ఉపయోగిస్తే ఫ్యూచర్లో దీర్ఘకాలిక రోగాలను కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు.వీటిని శుభ్రం చేసుకోవడానికి మార్కెట్ లో
 స్క్రీన్ లిక్విడ్లు లభిస్తూ ఉంటాయి.వాటిని స్ప్రే చేసి శుభ్రం చేసుకోవడం చాలా ఉత్తమం.
టీవీ రిమోట్ లు..
మొబైల్ తర్వాత అత్యధికంగా టచ్ చేసే పరికరాలు టీవీ రిమోట్లు.వీటిని ఎలా పడితే అలా ఏ వస్తువు అంటే ఆ వస్తువు తాకి వీటిని ముట్టుకోవడం వల్ల,జేమ్స్ అన్ని పేరుకు పోతాయి.వీటిని శుభ్రం చేయడానికి జెల్స్ వాడడం వల్ల,వీటిపై ఉన్న అనవసరమైన జేమ్స్ అన్ని పోతాయి.
హ్యాండ్ బ్యాగ్స్..
 స్త్రీలు వాడే హ్యాండ్ బ్యాగ్స్ మరియు మగవారు వాడే పర్సులలో రకరకాల వస్తువులను క్యారీ చేస్తూ ఉంటారు. అంతేకాక సంవత్సరాల పాటు ఒకే బ్యాగ్స్ ని వాడుతూ ఉండడం వల్ల కూడా ఎక్కువ జంమ్స్ పేర్కొని పోతాయి. కావున వీటిని అప్పుడప్పుడు ఉతకడంతో జంమ్స్ కి పులిస్టాప్ పెట్టొచ్చు.
టూత్ బ్రష్ హ్యాంగర్స్..
చాలామంది బ్రష్ వేసుకోవడానికి టూత్ బ్రష్ హ్యాంగర్స్ ని బాత్రూం లోనే ఉంచుకోవడం వల్ల,దానిపై టాయిలెట్ సీట్ కన్నా ఎక్కువ జేమ్స్ పేర్కొపోతాయి.కావున వీటిని తరుచూ శుభ్రం చేయడం చాలా మంచిది.
చాపింగ్ బోర్డ్స్..
మనం కూరగాయలు,మాంసం వంటివి కట్ చేయడానికి ఒకే రకమైన చాపింగ్ బోర్డ్స్ యూస్ చేయడం వల్ల, మరియు వాటిని సరిగా క్లీన్ చేయకపోవడం వల్ల కూడా జమ్స్ పేర్కొని పోతాయి.కావున వీటిని వేడి నీళ్లలో ఉంచి శుభ్రం చేసుకోవడం వల్ల జంమ్స్ ని పోగొట్టుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: