రోజుకో గ్లాస్ కరివేపాకు నీళ్ళు తాగితే స్త్రీలకు సంజీవని దొరికినట్టే..!
దీనికోసం ఒక గ్లాస్ నీటిలో గుప్పెడు కరేపాకులు వేసి బాగా మరగనివ్వాలి.ఇవి బాగా కలర్ మారిన తర్వాత దింపి,గోరు వెచ్చగా ఉన్నప్పుడు నిమ్మరసం,తేనె కలుపుకొని తాగండి.దీనిని పరగడుపునే తీసుకోవడం వల్ల మహిళల్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్,ప్రొస్టేట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్,యాంటీ ఇన్ఫ్లమేషన్ పుష్కలంగా లభిస్తాయి.దీనితో క్యాన్సర్ కారకమైన ప్రిరేడికల్స్ ను అడ్డుకోవడంలో అద్భుతంగా పనిచేస్తాయి కనుక.
మరియు కరివేపాకులో బీటా కెరొటీన్,విటమిన్ ఏ అధికంగా లభించడం వల్ల చుండ్రు,జుట్టు రాలిపోవడం, జుట్టు చివర్లు చిట్లడం వంటి ఎలాంటి జుట్టు సమస్యలు ఉన్నా కూడా తొందరగా నయమై,జుట్టు బారుగా,ఆరోగ్యంగా ఉండడానికి కూడా దోహదపడుతుంది.
కరివేపాకులో పీచుపదార్థాలు అధికంగా లభిస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉండటంతో బరువు తగ్గాలనుకునే వారికి చాలా మేలు చేస్తాయి.మరియు శరీరంలో జీవక్రియలు పెరిగి,కొవ్వులు కరిగిపోయే ప్రక్రియ వేగవంతం చేస్తాయి.దీనితో తొందరగా బరువు తగ్గవచ్చు.
అంతే కాక కరివేపాకులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందున రోగనిరోధక వ్యవస్థను కూడా బలపడుతుంది.దీనితో రుతుక్రమణ సమయంలో కలిగే పొట్టనొప్పి, క్లాట్స్ పడటం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్,అధిక బ్లీడింగ్ వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది.
రోజు చిటికెడు కరివేపాకు పొడి తీసుకోవడం వల్ల శరీరంలోని ఇన్ఫ్లమేషన్ తగ్గి నడుము నొప్పి,కీళ్ల నొప్పులు,మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలకు ఉపశమనం కలుగుతుంది.కావున స్త్రీలు కాఫీ,టీలకు బదులుగా కరివేపాకు నీరు తీసుకోవడం చాలా ఉత్తమం.