బియ్యంలోని పురుగులను తొలగించే ఇంటి చిట్కాలివే..!!

Divya
సాధారణంగా మన దేశమే వ్యవసాయ ఆధారిత దేశం. అలాంటి వ్యవసాయ ఆధారిత దేశం కనుకనే మన దేశం నుంచి బియ్యం,పప్పులు,సుగంధ ద్రవ్యాలు వేరే దేశాలకు కూడా ఎగుమతి చేస్తువుంటాము.మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి బియ్యం ఎక్కువగా ఎగుమతి అవుతాయి.కానీ ఇప్పుడు పండిస్తున్న బియ్యము ఎక్కువ రోజులు పాటు నిల్వ ఉండడం లేదు. దీనికి కారణం వాతావరణంలో ఉన్న తేమ,దుమ్ము కాలుష్యం,సరైన నిల్వ పద్ధతులు వాడకపోవడం వల్ల తొందరగా బియ్యం పురుగు పట్టేస్తూ ఉంటాయి.ఇంకా కొంతమంది అయితే కేవలం ఒక బస్తా బియ్యం తెచ్చుకున్నా కూడా అందులో క్లీన్ చేయలేనంతగా పురుగులు పట్టేస్తూ ఉన్నాయి.
ఇలా పురుగుల పట్టిన బియ్యం తినలేక చాలామంది మార్కెట్లో దొరికే కెమికల్ పౌడర్ ను వాడుతూ ఉంటారు. అయినా కూడా దానివల్ల అప్పటికప్పుడు పురుగులు చచ్చిపోయినా,మళ్లీ వస్తూ ఉంటాయి.ఇలా పురుగు పట్టిన బియ్యం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రావడమే కాక,కెమికల్ పౌడర్లు వాడడం వల్ల మన పొట్ట ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.అలా బియ్యంలోని పురుగులతో విసుగెత్తిపోయిన వారికి అమ్మమ్మల నాటి కాలం చిట్కాలు చాలా బాగా ఉపయోగపడతాయి అందులో ముఖ్యంగా..
లవంగాలు..
లవంగాలకు బ్యాక్టిరియా,పంగస్ వంటి దూరం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది.దీనికోసం లవంగాలను ఐదు నుంచి పది వరకు తీసుకొని ఒక గుడ్డ ముక్కలో మూట కట్టి,బియ్యం నిలువ చేసిన సంచిలో కానీ, డబ్బాలలో కానీ ఉంచాలి.దీనితో వారం రోజుల లోపు పురుగులన్నీ వాటి వాసనకు చనిపోతాయి.మరియు బియ్యం కూడా ఎక్కువ రోజులపాటు,ఎలాంటి స్మెల్ వంటిది రాకుండా నిలువ ఉంటాయి.
వేపాకు..
వేపాకులోని సుగుణాలు గురించి ఇంక చెప్పక్కర్లేదు. ఇందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఫంగల్ గుణాల వల్ల ఎటువంటి పురుగులైన దూరమవుతాయి. దీనికోసం వేపాకును గుడ్డ ముక్కలు మూట కట్టి, బియ్యంలో ఉంచుకోవాలి.
బిర్యానీ ఆకు..
బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలలో బిరియాని ఆకు కలిపి వారం రోజులు పెట్టామంటే చాలు..ఎటువంటి పురుగులైన దెబ్బకు పారిపోతాయి.
కర్పూరం,మిరపకాయలు..
బియ్యంలో ఎక్కువగా తెల్ల పురుగులు కనిపించినప్పుడు,రెండు కర్పూరం బిళ్ళలు,నాలుగు ఎండు మిరపకాయలు తీసుకొని బాగా దంచి,గుడ్డ ముక్కలు మూట కట్టి,బియ్యం నిల్వ చేసే డబ్బాలో ఉంచాలి.దీనితో తెల్ల పురుగులు పూర్తిగా నశించిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: