లస్సీ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు..!!

Divya
వేసవి మొదలైందంటే చాలు చాలా మంది చల్ల చల్లగా ఏదైనా తాగాలి అనుకుంటూ ఉంటారు.ముఖ్యంగా  చాలా మంది చల్లని నీరు తాగడం కన్నా ఏవైనా జ్యూస్ తాగడానికె ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.బయట అమ్మే కూల్ డ్రింకులు వేసవి తాపాన్ని తీర్చినా సరే ఎన్నో అనారోగ్య సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఎండ వేడిని తట్టుకోవడంతో పాటు,ఆరోగ్య ప్రయోజనాలను పెంచే లస్విని తాగడం చాలా మేలని చెప్తున్నారు వైద్యనిపుణులు.
పూర్వకాలంలో చాలామంది ఇళ్లలో పెరుగును తీసుకొని బాగా చిలికి మజ్జిగ చేసుకుని తాగేవారు.ఎందుకంటే లస్సీలో విటమిన్స్,కాల్షియం,పొటాషియం,సల్ఫర్, ఫోలిక్ యాసిడ్ పుష్కళంగా లభిస్తాయి కనుక.ఆ మజ్జిగను వారు తరుచు తీసుకోవడంతో మలబద్ధకం అనే సమస్యను తొలగించుకొనేవారు.ఇంకా చెప్పాలంటే అలాంటి వారికి లస్సీ దివ్యఔషధం అని చెప్పవచ్చు.పెరుగులాగా లస్సీలో కూడా ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా లభిస్తుంది.ఇది పొట్టలో వున్న చెడు బ్యాక్టీరియా వృద్ధిని నివారిస్తుంది.అంతేకాక శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో కూడా సహాయపడుతుంది.
వేసవిలో ఎక్కువగా చాలామంది అధిక వేడితో బాధపడుతూ ఉంటారు.అలాంటి వారు వేడితో బాధపడుతున్నవారు లస్సీ తాగడం చాలా మంచిదంట. ఇందులో ఎక్కువ ఎలక్ట్రోలైట్ కంటెంట్ అధికంగా లభిస్తుంది.అందువలన ఇది శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.
లస్సీలో కాల్షియం అధికంగా లభిస్తుంది.అందువలన దీన్ని రోజూ తీసుకోవడంతో ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా తయారవుతాయి.అంతేకాక అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.మరియు ఇందులోని పొటాషియం,రైబోఫ్లావిన్ వంటి పోషకాలు శరీరంలోని మలినాలను తొలగించి,రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
లస్సిలో కొంచెం జీలకర్ర, వాము పొడి కలిపి తీసుకోవడంతో  ఎసిడిటీ,అధిక బరువు,గ్యాస్ అజీర్తి, వాంతులు,వీరేచనాలు వంటి సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు.ఇలాంటి వారు భోజనం తరవాత కచ్చితంగా లస్సి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.ఈ వేసవి సమయంలో ఎక్కువగా చిన్న పిల్లలు మరియు వృద్ధులే అధిక ఎఫెక్ట్ అవుతారు.కనుక వాళ్ళు ఎక్కువగా లస్విని తయారు చేసుకునే తాగడం  చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: