వీటిని తింటే నీరసం, బలహీనత పరార్?

Purushottham Vinay
ఈ ఆహారాలని తీసుకున్న వారం నుండి పదిరోజులల్లోనే మనలో నీరసం తగ్గి చాలా ఉత్సాహంగా తయారవుతామని నిపుణులు చెబుతున్నారు. బలం పట్టే టానిక్ లు, మాంసం, గుడ్లకు బదులుగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల బలంగా తయారవవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.గుమ్మడి గింజలపప్పును  నానబెట్టి తీసుకోవడం వల్ల నీరసం తగ్గుతుంది. వీటితో పాటు నువ్వులను కూడా తీసుకోవచ్చని ఇవి మాంసం కంటే 5 రెట్లు బలమైన ఆహారమని నిపుణులు చెబుతున్నారు. అయితే నీరసంతో బాధపడే వారిలో జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పప్పులను నానబెట్టి తీసుకోవడం వల్ల త్వరగా జీర్ణమవుతాయి. వీటిని తీసుకున్న వారం నుండి పదిరోజులల్లోనే మనలో నీరసం తగ్గి మనం ఉత్సాహంగా తయారవుతామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.నీరసంతో బాధపడే వారు పల్లీలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిని రాత్రంతా నానబెట్టి తీసుకోవడం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. అలాగే పచ్చికొబ్బరిని తీసుకోవడం వల్ల కూడా నీరసం తగ్గుతుంది.


పచ్చికొబ్బరిలో కొలెస్ట్రాల్ ఉండదు. దీనిని తీసుకోవడం వల్ల బలంగా తయారవ్వవచ్చు. అదే విధంగా పుచ్చగింజల పప్పు కూడా చాలా బలమైన ఆహారమని నిపుణులు చెబుతున్నారు. 
మాంసం, జీడిపప్పు కంటే పుచ్చగింజల పప్పు చాలా బలమైన ఆహారమని వారు చెబుతున్నారు.వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల నీరసం తగ్గుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. అదే విధంగా పొద్దు తిరుగుడు పప్పును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల నీరసం తగ్గు ముఖం పడుతుంది.ఇవి అందరికి అందుబాటు ధరల్లో ఉంటాయని వీటిని ఎవరైనా కొనుగోలు చేసి తీసుకోవచ్చని వారు చెబుతున్నారు. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల అతి తక్కువ ఖర్చులో మనం నీరసాన్ని తగ్గించుకుని బలాన్ని సొంతం చేసుకోవచ్చు.కేవలం మాంసమే కాకుండా ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్దమైన ఈ బలవర్దకమైన ఆహారాలు తింటే ఖచ్చితంగా సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీటిని తినండి.ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: