మహిళలను సంతోషంగా ఉంచే ఆహారలెంటో తెలుసా..?

Divya
ఈ మధ్య కాలంలో చాలామంది ఆడవారు ఇతరులపై ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెంచుకొని,అవి ఫుల్ ఫీల్ కాక డిప్రెషన్ కి లోన్ అవుతూ ఉన్నారు.ఇంకొంతమంది భర్త తనకే సొంతమని భావిస్తూ,డిప్రెషన్ లోన్ అవుతూ ఉంటే,మరి కొంతమంది వేరే వారి ఆర్భాటాలు మనకు లేవే..అని బాధపడుతూ డిప్రెసివ్ గా తయారవుతూ ఉంటారు.అంతేకాక మనం తినే ఆహారం మీద కూడా మన మెదడు హార్మోనల్ చేంజెస్ చేస్తుందని తెలియక, టెన్షన్ లో ఏవేవో తింటూ ఉంటారు.
అలాంటి మసాలాలు మరియు కొవ్వులు అధికంగా ఉన్న ఆహారాలు తినడం వల్ల కూడా డిప్రెషన్ కి కారణమేనని ఆహార నిపుణులు చెబుతున్నారు.వీటితో ఎక్కువ డిప్రెషన్ వస్తుంది.కనుక ఈ డిప్రెషన్ తగ్గించడానికి కొన్ని రకాల సాత్వికమైన ఆహారాలను తీసుకోవడంతో,మంచిగా మూడ్ చేంజ్ అయ్యి,డెవలప్మెంట్ సైడు వెళ్తారని ఆహార నిపుణులు చెబుతున్నారు.మరి అ ఆహారలెంటో మనము తెలుసుకుందాం పదండి..
సాధారణంగా సెరోటోనిన్,డోపమైన్,ఎండార్ఫిన్లు అనే సంతోషకరమైన హార్మోన్లు మానసిన స్థితిని నియంత్రంచడంలోనే కాక మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర వహిస్తాయి.ఈ హార్మోలను సమతుల్యం చేసే ఆహారాలు ఏమిటంటే..
డార్క్ చాకలేట్..
డార్క్ చాక్లెట్లో సెరోటోనిన్ ఎక్కువగా లభిస్తుంది.ఇది మానసిక స్థితిని మెరుగుపరచి,చక్కని రీఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది.
అవకాడో..
కనీసం వారానికి రెండు సార్లనా అవకాడో తీసుకోవడం వల్ల ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్,బి విటమిన్లు పుష్కలంగా అందుతాయి.దీనితో మెదడు ఆరోగ్యానికి, ఆనందంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
బ్లూ బెర్రీస్..
బ్లూబెర్రీస్ ఆహారంలో తీసుకోవడంతో ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లతో అధికంగా అందుతాయి.ఈ బెర్రీస్ ని తరుచూ తీసుకోవడంతో మెదడు ఆరోగ్యానికి, మానసిక స్థితిని సానుకూలపరిచేందుకు ఉపయోగపడతాయి.
పోలేట్..
పచ్చి ఆకుకూరల్లోని ఫోలేట్ సెరోటోనిన్ నియంత్రణలో, మానసిక స్థితిని పెంచడంలో సహాయపడుతుంది.
డ్రై ఫ్రూట్స్..
ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే డ్రై ఫ్రూట్స్ ని ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవాలి.ఇది మానసిక స్థితిని పెంచుతుంది.న్యూరోట్రాన్స్ మీటర్లను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.
ఓట్స్..
ఓట్స్ సెరోటోనిన్ ఉత్పత్తిలో సహాయపడే కార్బోహైడ్రేట్ ఇది ఆనందానికి పెంచేందుకు కారణం అవుతుంది.
ఇందులో ట్రిప్టోఫాన్, విటమిన్ B6 అధికంగా ఉంటాయి. ఇవి ఉల్లాసమైన మూడ్‌ని పెంచడమే కాకుండా సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతాయి.
కావున మహిళలారా..మీ ఇంటి ఆరోగ్యాన్ని కాక,మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: