ఈ చిన్న జాగ్రత్తలతో కరోనా మహమ్మారిని తరిమికొట్టండి..!

Divya
ప్రపంచాన్ని కబలించిన అతిపెద్ద మహంమ్మారిలో కరోనా ఒక పెద్ద వ్యాధి అని చెప్పవచ్చు.ఈ కరోనా ఒక్కొక్క దశలో ఒక్కొక్క వేరియంట్ రూపంలో వస్తూనే ఉంది.ఈ కరోనాలో jn1అనే వైరస్ నాలుగో దశలో విజృంభిస్తోందని చాలా అధ్యయనాలు పేర్కొంటూ ఉన్నాయి.ఈ జెన్ వన్ చాలా దేశాలలో వ్యాప్తి చెందడం వల్ల,ఆ దేశం నుంచి మన దేశానికి ట్రావెల్ చేసిన వారిలో నుంచి వచ్చిన వారిలో ఎక్కువగా కనిపిస్తోందని, ముఖ్యంగా కేరళలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అసలు ఇంతటి ప్రాణంతక మహమ్మారిని కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలతో దూరం పెట్టవచ్చు అని,వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు.
పదేపదే చేతులు కడుక్కోవడం..
మన హిందూ ఆచారం ప్రకారం మనం భోజనం చేసే ముందు కచ్చితంగా చేతులు,కాళ్లు శుభ్రం చేసుకోవడం మన కాలవాటే.కావున ప్రతి ఒక్కరూ తినడానికి ముందు మరియు తిన్న తర్వాత చేతులను కచ్చితంగా శుభ్రం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు.ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండడం వల్ల,పని అనిరీత్యా బయటికి వెళ్లిన వారు కూడా ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్లు,చేతులు శుభ్రం చేసుకోవడం తప్పనిసరి.
మాస్క్ వేసుకోవడం..
కచ్చితంగా ప్రతి ఒక్కరు పదిమందిలోకి వెళ్ళినప్పుడు ఎలాంటి మొహమాటం లేకుండా మాస్క్ ధరించడం వల్ల, వైరస్ వ్యాప్తిని అంతం చేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వ్యాక్సిన్లు తీసుకోవడం..
భారత్లో చాలా ప్రదేశాల్లో టెంట్లు వేసి మరి వ్యాక్సిన్లను ఇస్తూ ఉన్నా సరే,చాలామంది అవగాహన లోపంతో వ్యాక్సిన్లు తీసుకోకుండా ఉన్నారు.అలా కాకుండా ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేస్తూ తీసుకునేలా మోటివేట్ చేయాలని,ఈ పనిని యువత చేతిలో తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
వ్యాధి లక్షణాలు గుర్తించడం..
చాలామంది వైరల్ ఫీవర్ కానీ,జలుబు,సోర్ గొంతు,అదే పనిగా ముక్కు కారడం కానీ వంటివి వారికి వస్తే,ఖచ్చితంగా కరోనా టెస్ట్ చేయించుకోవాలని,ఈ చిన్న పని వల్ల కరోనా ని పారద్రోలచ్చని నిపుణులు సూచిస్తూ ఉన్నారు.
కావున ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ పట్ల అవగాహన తెచ్చుకుని,జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: