ప్రతి ఇంటి పూజ గదిలో ఉండాలిసిన వస్తువులివే..!

Divya
మన ఇంటి పూజ గది మనకు దేవాలయం తో సమానం. అ పూజ గదిలో లక్ష్మిదేవి కొలువై ఉంటుందని నమ్ముతాం.అ లక్ష్మిదేవి తన ఎనిమిది రూపాలలో ఉండి, మన అష్టకష్టాలను తొలగిస్తుంది.కావున లక్ష్మీదేవిని ఇంట్లో కొలువ అయ్యేలా చేయడానికి, అ తల్లికి ఇష్టమైన కొన్ని రకాల వస్తువులను పూజ గదిలో కచ్చితంగా ఉంచుకోవాలని వేద పండితులు చెబుతున్నారు.దీనివల్ల మన ఇంట్లో ఉన్న అష్టదరిద్రాలు పోయి,అష్టైశ్వర్యాలు వస్తాయని సూచిస్తున్నారు.మరి అవి ఏంటో మనము తెలుసుకుందాం పదండి..

పీచుతో ఉన్న కొబ్బరికాయ..

కొబ్బరికాయను పూజాగదిలో ఉంచి పూజించడం వల్ల  మీ ఇంట్లోనే ధనం ఎప్పటికీ తరిగిపోదు.మరియు ఖజానా ఖాళీగా అవడం నమ్ముతారు.దీనితో ధనలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.

గోమతి చక్రం..

ప్రతి ఇంట్లో గోమతి చక్రం ఉంచి,పూజలు నిర్వహించాలి.దీనితో లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద ప్రవాహం పెరుగుతుందని విశ్వసిస్తారు

మెటల్ తాబేలు..

ఇంట్లో సుఖ సంతోషాలు ఉండటానికి,లక్ష్మీదేవి ప్రసన్నం కావడానికి,పూజ గదిలో ఒక మెటల్ తాబేలు తీసుకువచ్చి పెడితే మంచిదని చెబుతారు.తాబేలు ఇంట్లో ఉంటే లక్ష్మీ నివాసం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు బలంగా నమ్ముతారు

నెమలి ఈకలు..

నెమలి ఈకలు ఇవి ఇంట్లో ఉండడం వల్ల లక్ష్మీ కటాక్షం ఉంటుందని,మానవుని జీవితంలో కలిగే అడ్డంకులను తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతారు.కాబట్టి కచ్చితంగా పూజ గదిలో నెమలి ఈకలను పెట్టుకోవడం శుభసంకేతం.

శంకువు..

ఇంటికి శంఖాన్ని తెచ్చి పెడితే చాలా శుభం.శంఖం తో విష్ణుమూర్తిని పూజిస్తే ఇంటికి మంచి జరుగు తుందని, ధనలాభం కలుగుతుందని చెబుతుంటారు.అంతేకాక ఉద్యోగంలో వృద్ధి చెందాలనుకునే వారికి చాలా బాగా సహాయపడుతుంది.

రాగి సూర్యుడు..

రాగి సూర్యుడు రాగితో తయారుచేసిన సూర్యుడిని పూజ గదిలో ఉంచి పూజించడం వల్ల,వారి ఆర్థిక అభివృద్ధి పెరగడమే కాకుండా,సామాజికంగా కూడా పేరు ప్రతిష్టలను పొందుతారు.

కావున మీరు కూడా ఈ వస్తువులను పూజ గదిలో ఉంచి పూజలు నిర్వహించడం వల్ల,లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఆర్థికంగా, ఉద్యోగం,వ్యాపారం వంటి వాటిలో కూడా అభివృద్ధి చెందుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: