ఆరెంజ్ పీల్ పౌడర్ తో చిటికెలో మొఖాన్ని మెరిపించండిలా..!
దీని కోసం ముందుగా ఆరెంజ్ పీల్ పౌడర్ ని తయారు చేసి,ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి.ఇలా ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే,ఎప్పటికప్పుడు పెషియల్ చేసుకోవచ్చు.ఇప్పుడు ఒక స్పూన్ ఆరెంజ్ బీర్ పౌడర్ తీసుకొని అందులో ఒక స్పూన్ శనగపిండి,రెండు టేబుల్ స్పూన్ల తేనె,చిటికెడు పసుపు,చిటికెడు చందనం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫేషియల్ గా అప్లై చేసుకోవడానికి ముందు ముఖం బాగా శుభ్రంగా కడుక్కోవాలి.ఆ తర్వాత పైన చెప్పిన మిశ్రమాన్ని ముఖానికి బాగా అప్లై చేసి,అరగంట నుంచి ఐదు నిమిషాల వరకు ఆరనివ్వాలి.ఇలా ఆరిన తర్వాత మెల్లగా రుద్దుతూ నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ ఫేషియల్ వేసుకున్న తర్వాత శుభ్రం చేసుకోవడానికి ఎలాంటి కెమికల్ సోపులు వాడకూడదు. మరియు శుభ్రం చేసిన వెంటనే న్యాచురల్ మాయిశ్చరైసర్ రాసుకోవాలి.ఇలా అప్పటికప్పుడు ఫేషియల్ చేసుకున్న సరే ముఖంపై మృతకణాలు తొలగిపోవడమే కాక,చర్మంపై ఎంతో గ్లో వచ్చి అందంగా కనబడతారు.
ఈ ప్యాక్ లో వాడిన ఆరెంజ్ ఫీల్ పౌడర్ లో విటమిన్ సి మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా లభిస్తాయి.ఇవి మృత కణాలు పోగొట్టడమే కాకుండా మొటిమలను,మచ్చలను కూడా దూరం చేస్తాయి. ఎవరైనా డ్రై స్కిన్ తో బాధపడుతుంటే,వారికి అలోవెరా జెల్ మంచి హైడ్రేషన్ గురిచేసి చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.కావున ఈ చిట్కాని ఎలాంటి స్కిన్ కలవారైనా భయం లేకుండా ఈజీగా వేసుకోవచ్చు.