మగవారిలో హార్మోనల్ సమస్యలు తగ్గించే మసాలాలివే..!

Divya
సాధారణంగా మగవారిలో హార్మోనల్ సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి.కానీ కొంతమందిలో హార్మోనల్ సమస్యలు అధికంగా ఉండి,వారి దాంపత్య జీవితాన్ని కూడా చిందర వందర చేస్తూ ఉంటాయి.అసలు దాంపత్య జీవితానికి మగవారిలో ఉండవలసిన హార్మోన్లు ఈస్ట్రోజన్ మరియు టెస్టోస్టీరాన్.ఈ హార్మోన్లు కొంతమందిలో హెచ్చుతగ్గులు అయినవారు టాబ్లెట్ల రూపంలో తీసుకుంటూ,వాటిని క్రమబద్ధీకరించుకుంటూ ఉంటారు.కానీ ఈ మందు బిళ్ళలను తరచు మింగడం వల్ల,శరీరంలో ఇతర దృశ్య ప్రభావాలు కలుగుతూ ఉంటాయి.అలా కాకుండా తరచూ మనం వాడే కొన్ని రకాల మసాలాలు హార్మోనల్ సమస్యలు తగ్గిస్తాయని ఆహార నిపుణులు చెబుతున్నారు.మరియు వీటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కూడా కలగవు.మరి అవేంటో తెలుసుకుందాం పదండి..
 జాజికాయ..
జాజికాయ వయాగ్రాను మించిన మందుగా పనిచేస్తుంది. ఎవరైనా మగవారు హార్మోనల్ ఇమ్బాలన్స్ తో బాధపడుతూ ఉంటే,వెంటనే ఈ జాజికాయ పొడిని చిటికెడు తీసుకొని పాలలో వేసుకొని తాగడం చాలా ఉత్తమం.
కుంకుమ పువ్వు..
మగవారిలో ఈస్ట్రోజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు కుంకుమపువ్వు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాంటి వారి కోసం రోజు వేడి పాలలో ఒక రెమ్మ కుంకుమపువ్వు వేసి తాగడం వల్ల,హార్మోన్లు సక్రమంగా ఉత్పత్తి అవుతాయి
 వెల్లుల్లి..
హార్మోనల్ సమస్యతో బాధపడే వారికి వెల్లుల్లి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.దీనికోసం రెండు వెల్లుల్లి రెబ్బలను దంచి,రెండు స్పూన్ల నెయ్యిలో వేసి వేయించాలి.ఆ తర్వాత దీనిని వారికి భోజనంలో ఇవ్వడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి.
అల్లం..
టెస్టోస్టీరాన్ లెవెల్స్ తక్కువగా ఉన్నవారికి అల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది.అలాంటివారు అల్లం ను రోజు వారి భోజనంలో ఏదో ఒక రూపంలో తీసుకోవడం చాలా ఉత్తమం.
జిన్ సింగ్..
జీన్ సింగ్ అనే దుంపను రోజు మగవారికి ఆహారంలో తీసుకోవడం వల్ల వారి నపుంసకత్వాన్ని పోగొట్టుకోవచ్చు.కానీ ఇది చాలా రేర్ గా మార్కెట్లో లభిస్తుంది.దొరికితే మాత్రం అస్సలు వదలకండి.
కావున మీరు కానీ,మీ కుటుంబ సభ్యులకు కానీ ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే వెంటనే ఈ మసాలా దినుసులను ట్రై చేయండి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: