ఈ చిన్న చిట్కాతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ?
చాలా మందికి కూడా తమలపాకు తినే అలవాటు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ తమలపాకులోని ఆస్ట్రింజెంట్ ఎన్నో అనారోగ్య సమస్యలను చాలా ఈజీగా తగ్గిస్తుంది.తమలపాకు,తులసి గింజలను కలిపి తీసుకుంటే లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. తులసి గింజలను తులసి చెట్టు నుండి తీసుకోవచ్చు.లేదా ఇవి మనకు ఆయుర్వేదం షాప్ లలో కూడా లభ్యం అవుతాయి.ఒక అర గ్లాసు నీటిలో పావు స్పూన్ తులసి గింజలను వేసి రెండు గంటల పాటు నానబెడితే ఆ గింజలు జెల్లీలా ఉబ్బుతాయి. ఇక ఈ మిశ్రమంలో ఒక తమలపాకును రసంగా తీసుకొని కలపాలి. ఈ మిశ్రమంను వారంలో మూడు రోజులు పాటు తీసుకుంటే ఖచ్చితంగా మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చిగుళ్ళ వాపును తగ్గిస్తాయి. నోటి దుర్వాసన లేదా చిగుళ్ళ నుండి రక్తం రావడం వంటి సమస్యలను తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
శారీరక బలహీనత లేకుండా చేస్తుంది.ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. మన శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉంటే ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. ఈ సీజన్ లో వచ్చే జలుబు,ఫ్లూ,గొంతు నొప్పి ఇంకా అలాగే కఫం వంటి వాటిని తగ్గిస్తుంది. అలాగే తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.జీర్ణప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది. లాలాజల గ్రంథిని చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ గ్రంథి ఆహారాన్ని చిన్న ముక్కలుగా విడగొట్టడానికి సహాయపడి…తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి మలబద్ధకం, అజీర్ణం మరియు గ్యాస్, గ్యాస్ట్రిక్ అల్సర్ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ చిట్కా పాటించండి. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఎన్నో రోగాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.ఈ చిన్న చిట్కాతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు