పీరియడ్స్ పెయిన్‌ తగ్గాలంటే ఇవి తినండి?

Purushottham Vinay
మహిళలు ప్రతి నెలా కూడా పీరియడ్స్ పెయిన్‌తో బాగా ఇబ్బంది పడడం సర్వసాధారణమైన విషయమే. కానీ కొన్ని రకాల ఆహారాపు అలవాట్లు ఇంకా జీవనశైలి మార్పుల కారణంగా ఈ నొప్పి నుంచి చాలా ఈజీగా ఉపశమనం పొందవచ్చు.ఇంకా అలాగే పీరియడ్స్ సమయంలో ఎదురయ్యే వికారం, తలనొప్పి, మూడ్ స్వింగ్స్, బాడీ పెయిన్స్ వంటి ఇతర ఇబ్బందులను కూడా ఈజీగా నిరోధించవచ్చు. అందుకోసం నిత్యం తీసుకునే ఆహారంలో ఓ 5 పదార్థాలను కలిపి తీసుకుంటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వారు తెలియజేసిన ప్రకారం పీరియడ్స్ పెయిన్ నుంచి ఉపశమనం కోసం ఏయే పదార్థాలను తీసుకోవాలంటే..నల్లని ఎండు ద్రాక్ష, కుంకుమ పువ్వు కలయిక పీరియడ్స్ పెయిన్ నుంచి ఈజీగా ఉపశమనం కలిగిస్తుంది. ఇందుకోసం మీరు రాత్రి పూట నానబెట్టిన ఎండుద్రాక్ష ఇంకా కుంకుమ పువ్వును పీరియడ్స్ రోజుల్లో ఉదయాన్నే తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల వీటిల్లోని పోషకాలు మీకు నొప్పి నుంచి ఈజీగా విముక్తి కలిగిస్తాయి.


ఇక పీరియడ్స్ సమయంలో నెయ్యి తీసుకోవడం కూడా నొప్పి నివారణకు మంచి పద్ధతి. ఇందుకోసం మీ ఆహారంలో నెయ్యిని కలిపి తినండి. దాని ఫలితంగా నొప్పితో పాటు తిమ్మిర్లు, వికారం కూడా ఈజీగా తగ్గుతాయి.అలాగే బహిష్టు సమయంలో కడుపు నొప్పితో బాధపడేవారికి పెరుగు మంచి భోజన ఎంపిక. శరీరంపై సానుకూల ప్రభావాలే తప్ప దుష్ప్రభావాలను కలిగించిన పెరుగుతో శరీరానికి మంచి శక్తి కూడా లభిస్తుంది.అలాగే జీడిపప్పు, బాదం, వేరు శనగలు, గుమ్మడి గింజలు వంటి వాటిని తీసుకోవడం వల్ల కూడా పీరియడ్స్ నొప్పి, మూడ్ స్వింగ్స్ ఇంకా కండరాల నొప్పులు తగ్గుతాయి.అలాగే మిల్లెట్స్ కూడా పీరియడ్స్ పెయిన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మిల్లెట్స్‌తో చేసిన దోశ ఇంకా రోటీ వంటివాటిని తీసుకోవడం వల్ల పీరియడ్స్ నొప్పితో పాటు కడుపు నొప్పి కూడా దూరం అవుతుంది.కాబట్టి మహిళలు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన ఈ ఆహారాలు తీసుకోండి. ఖచ్చితంగా వారికి మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: