అన్వెంటెడ్ హెయిర్ తో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలు మీకోసమే..!

Divya
సాధారణంగా అన్వెంటెడ్ హెయిర్ రావడానికి కారణం మన శరీరంలో హార్మోనల్ ఇన్ బాలన్స్ ఉండడమే.ఈ హార్మోనల్ ఇన్ బాలన్స్ వల్ల స్త్రీలలో గడ్డం,మీసాలు మరియు రకరకాల ప్రదేశాలలో ఎక్కువ వెంట్రుకలు పెరుగుతూ ఉంటాయి.ముఖ్యంగా మొహంపై అన్వాంటెడ్ హెయిర్ తో చాలామంది బాధపడుతూ ఉన్నారు.దీనివల్ల వారు అందవిహీనంగా కనబడటమే కాకుండా,అవమానాలు పాలు కూడా అవుతున్నారు. ఇలాంటి వారు నలుగురిలో కలవాలన్న ఇబ్బంది పడుతూ,ఇన్ఫియారిటీ కాంఫ్లెక్స్ కి గురవుతున్నారని కొన్ని పరిశోధనలు కూడా తెలుపుతున్నాయి.

ఇక కొంతమంది స్త్రీలు అయితే ఈ అన్వాంటేడ్ హెయిర్ ని తొందరగా తగ్గించుకోవాలని బ్యూటీ పార్లర్కి వెళ్లి త్రెడ్డింగ్,వ్యాక్సింగ్ అంటూ రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతూ,ఇతర ఇబ్బందులను కొని తెచ్చుకుంటూ ఉన్నారు.అలాంటి వారి కోసం మన ఇంట్లో దొరికే కొన్ని రకాల నాచురల్ ప్రొడక్ట్స్ తో చేసే చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి.మరియు తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అడ్వాంటేడ్ హెయిర్ ని పోగొట్టుకోవచ్చు.అవేంటో మనము తెలుసుకుందాం పదండి..

ఈ చిట్కా కోసం ముందుగా ఒక గుడ్డును పగలకొట్టి, అందులో తెల్లసోన మాత్రమే మెల్లగా పక్కకి తీసుకోవాలి.ఆ తరువాత అందులో ఒక చిటికెడు పసుపు,ఒక స్పూన్ తేనె,ఒక స్పూన్ శనగపిండి  వేసిబాగా మిక్స్ చేయాలి.వీలైతే ఇందులో జలాటిన్ పౌడర్ వాడినా కూడా చాలా ఉత్తమం.ఆ తరువాత ఈ మిశ్రమాన్ని అన్వాంటెడ్ హెయిర్ ఎక్కడ ఉందో అక్కడ అప్లై చేసి అరగంట సేపు ఆరనివ్వాలి.ఇలా ఆరిన తరువాత నెమ్మదిగా ఫీల్ ఆఫ్ చేసి,గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇందులో వాడిన శెనగపిండి వల్ల చర్మం డ్రై అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కావున ఏదైనా ఒక మాయిశ్చరైజర్ ని అప్లై చేసుకుంటే చాలా మంచిది.ఇలా ఈ చిట్కాని వారానికి రెండుసార్లు వాడడం వల్ల,చర్మంపై ఉన్న హెయిర్ పాలికల్స్ తో సహా బయటికి వచ్చేస్తాయి.ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే ఈ చిట్కా తప్పక వాడండి మంచి ఫలితం ఉంటుంది.అంతేకాక మన శరీరంలో ఉన్న హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యేలాగా చికిత్స తీసుకోవడం కూడా ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: