భార్య, భర్త విడిపోతే పిల్లలు తండ్రి వద్ద ఉండొచ్చా?

పిల్లల బాధ్యతలను గాలికొదిలేసి భర్త సంపాదనను తీసుకుని వేధిస్తున్న భార్యలకు ఇటీవల చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. జస్టిస్ మానవేందర్ ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టిస్తోంది. పిటిషనర్ భర్త ఆమెను వదిలేసి మరో మహిళతో ఉంటున్నారని అలాంటి వ్యక్తి వద్ద పిల్లలను ఉంచడం ప్రమాదకరమని ఒక కేసు నడిచింది.

17 సంవత్సరాల అమ్మాయిని 7 సంవత్సరాల అబ్బాయిని బలవంతంగా లాక్కెళ్లారని భార్య కేసు వేసింది. వాళ్లిద్దరిని తక్షణమే అప్పగించాలని కోర్టులో కేసు వేసింది. హస్టల్ నుంచి తమ తండ్రి బలవంతంగా తీసుకెళ్లలేడని ఇష్టపూర్వకంగానే సెలవులు ఉన్నాయని వెళ్లామని పిల్లలిద్దరూ కోర్టులో చెప్పారు. ఇలా చెప్పడం వల్ల తండ్రి వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇష్టంతో ఉన్నప్పుడు వారు తీసుకున్న నిర్ణయం సరైనదేనని కోర్టు చెప్పింది. దీంతో పాటు కేసును కొట్టివేస్తున్నట్లు పేర్కొంది.

అయితే చాలా మంది భార్యలు సంపాదన బాగున్నపుడు భర్తతో ఉండి ఏ మాత్రం సంపాదన లేని సమయంలో పిల్లలను కూడా భర్తకు కలవనీయకుండా చేయడం అనేది చాలా చోట్ల జరుగుతోంది. ఇలాంటి కేసుల్లో పిల్లలను కూడా కలవలేని తండ్రులు ఎంతో మానసిక క్షోభకు గురయ్యే వారు ఉన్నారు. అలాంటి సందర్భంలో కోర్టు ఇచ్చిన తీర్పు పిల్లలకు దూరంగా ఉంటున్న చాలా మందికి అనుకూలం అని చెప్పొచ్చు.

కానీ డబ్బు అనే మోజులో పడి చాలా మంది భర్తలకు దూరమవుతుంటారు. పిల్లలను కనీసం భర్తల వద్దకు పంపేందుకు కూడా ఒప్పుకోరు. తండ్రి చెడ్డవాడని పరాయి స్త్రీతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని పిల్లలకు లేని పోనివి కల్పించి చెప్పి తండ్రిని దూరం చేస్తారు. వారి క్యారెక్టర్ ను బ్యాడ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఎదిగిన తర్వాత పిల్లలకు తండ్రి అంటే ఎంతో అసూయ కలుగుతుంది. తండ్రిని విలన్ గా చూడటం మొదలెడతారు. కాబట్టి పిల్లలు తండ్రిని కలిసే అవకాశం కల్పించే ఇలాంటి తీర్పులు కొంతమందికి చెంపపెట్టు లాంటివి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: