పిల్లల్లో ప్రోటీన్ లోపం రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలు పెడితే చాలు..!
గుగ్గిళ్లు..
శనగలు,పెసర్లు,బొబ్బర్లు లేదా అలసందులు వంటివి ఉడకబెట్టి ఇవ్వడం వల్ల కుడా వారిలోని ప్రోటీన్ లోపాలను తగ్గించవచ్చు.కానీ కొంతమంది పిల్లలు వీటిని తినడానికి అంతగా ఇష్టపడరు.అలాంటి వారికి గుగ్గిళ్లతో ఇంట్రెస్టింగా చాట్స్ తయారు చేసి ఇవ్వడం,పెసరపప్పు వంటి వాటితో పెసరట్టు,దోశలు వంటివి చేసి పెట్టాలి. దీనితో వారికి రుచికి రుచి,ఆరోగ్యానికి ఆరోగ్యం కలుగుతుంది.
పాల పదార్థాలు..
పాలపదార్థాలైనా పెరుగు,పాలు,చీజ్,పనిర్ ఇవ్వడం వల్ల కూడా ప్రోటీన్ లోపాన్ని అధిగమించవచ్చు.కావున ఎదిగే పిల్లల కోసం రోజూ ఒక గ్లాసు పాలు ఇవ్వడం చాలా ఉత్తమం.చీజ్ పనిర్ లతో రకరకాల స్నాక్స్ చేసి ఇవ్వడంతో కూడా పిల్లలు వాటిని ఇంట్రెస్టింగా తింటారు. మరియు వారి ఆరోగ్యం కూడా దెబ్బతినకుండా ఉంటుంది.
మాంసం..
మాంసము ప్రోటీన్ కి పుట్టినిల్లు అని చెప్పవచ్చు.చేపలు, గుడ్లు,చికెన్,మటన్ వంటివి తగిన మోతాదులో పిల్లలకి ఇవ్వడంతో ప్రోటీన్ లోపాలు తలెత్తవని ఆహార నిపుణులు చెబుతున్నారు.కానీ చికెన్,మటన్ వంటివి తగిన క్వాంటిటిలో మాత్రమే కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.లేకుంటే వీటి వల్ల చాలా దుష్ప్రభావాలు ఎదుర్కొవాల్సి వస్తుంది కూడా..పిల్లలకు రోజుకొక గుడ్డు ఇవ్వడం చాలా మంచిది.దానితో వారిలో కండర పుష్టి మరియు మెదడు పెరుగుదలకు తోడ్పాడతాయి.
మీల్ మేకర్..
కొంతమంది పిల్లలు మాంసం తినడానికి ఇష్టపడరు.అలాంటి వారికి మీల్ మేకర్ మంచి ప్రోటీన్ ఆహారమని చెప్పవచ్చు.మీల్ మేకర్ తో రకరకాల ఆహారాలు వండి,పిల్లలకు పెట్టడం వల్ల వారికి ప్రోటీన్ లోపాన్ని దరిచేరకుండా కాపాడుకోవచ్చు.వీటితో పాటు తగిన పండ్లు,కూరగాయలు తినిపించడం కూడా చాలా ముఖ్యం.