బరువుని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే?

Purushottham Vinay
శరీర బరువును తగ్గించుకోవడం చాలా కష్టం. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ఆయుర్వేద గుణాలు కలిగిన కొన్ని సూపర్‌ డ్రింక్స్‌ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తాగడం వల్ల శరీరం హైడ్రేట్‌ అవ్వడమే కాకుండా పొట్ట సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి.బ్లాక్ కాఫీ ప్రతి రోజు తాగడం వల్ల  శరీర బరువు ఈజీగా తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చక్కెర లేని బ్లాక్ కాఫీని తాగడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు రెండు కప్పుల బ్లాక్‌ టీని  తాగాల్సి ఉంటుంది.అలాగే యాపిల్ వెనిగర్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.ఎందుకంటే ఇందులో అధిక పరిమాణంలో పోషకాలు లభిస్తాయి. యాపిల్‌ సైడర్‌లో కొలెస్ట్రాల్‌ను నియంత్రించే ఎసిటిక్‌ యాసిడ్‌ చాలా ఎక్కువగా ఉంటుంది.


అందుకే దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్‌పై ప్రభావం చూపి మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఇక అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నవారు ఒక చెంచా యాపిల్ వెనిగర్‌ను.. గ్లాసు నీటిలో కలిపి తాగాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజు తాగడం వల్ల చాలా ఈజీగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.ఇంకా అంతేకాకుండా ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది.హెల్తీ డ్రింక్స్‌లో గ్రీన్‌ టీ శరీరానికి ఎన్ని రకాల ప్రయోజనాలను కలిగిస్తుందో  తెలిసింది.ఎందుకంటే ఇందులో యాంటీఆక్సిడెంట్స్‌ ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు కూడా రెండు సార్లు ఈ టీని తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ సులభంగా తగ్గుతుంది. ఇంకా అంతేకాకుండా శరీర బరువు కూడా తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు ఇంకా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రతి రోజు గ్రీన్‌టీలను తాగాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: