ఉల్లిపొట్టుతో నిద్ర బాగా వస్తుందని మీకు తెలుసా..?

Divya
సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉల్లిపాయ లేకుండా వంట వండలేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఉల్లిపాయ కోసినప్పుడు కన్నీరు తెప్పించినా అందులోని పోషకాలు వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అటువంటి.ఉల్లిపాయ కోసిన తర్వాత,దానిపై ఉన్న ఉల్లి పొట్టును పడేస్తుంటారు. కానీ అందులోని సుగుణాలు నిద్రలేమికి ఔషధాలు అంటే ఆశ్చర్యపోవాల్సిందే. అవును ఉల్లి పొట్టుతో తయారు చేసుకునే కషాయం,తొందరగా నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది. అది ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం.
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని నానుడి. ఎందుకంటే ఉల్లిలోని ప్రతిపాయ ఔషధాలను కలిగి ఉంది కనుక. ఈ పొట్టులో ఎల్- ట్రిప్టోపాన్ ఉంటుంది. ఇది తొందరగా నిద్ర రావడానికి ఉపయోగపడుతుంది. ఉల్లిపట్టు కషాయం కొరకు గుప్పెడు ఉల్లిపొట్టు తీసుకుని, ఒక గ్లాసు నీళ్లలో వేసి బాగా మరిగించి, కలర్ మారిన తర్వాత అందులో ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలుపుకొని రాత్రి భోజనం తర్వాత గంటసేపు ఆగి త్రాగాలి. ఇది ఎంత నిద్రలేమితో బాధపడుతున్నవారికి తొందరగా నిద్రకు ఉపక్రమించేలా ఉపయోగపడుతుంది.
అంతేకాక దీనిని తరచూ తీసుకోవడం వల్ల, అధిక రక్తపోటు,మలబద్ధకం,అజీర్తి వంటి సమస్యలు కూడా తొందరగా తొలగిస్తుంది.ఈ ఉల్లి కషాయంను రోజు తీసుకోవడం వల్ల, మన శరీరానికి కావాల్సిన పొటాషియం,ఫాస్ఫరస్,ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. ఇది శరీర ఆరోగ్యానికె కాక,జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.దీని కోసం ఉల్లి పొట్టును గుప్పెడు తీసుకొని నీళ్లలో వేసి బాగా ఉడికించి, అందులో ఒక స్పూన్ కలబంద గుజ్జు కలిపి మిశ్రమంలో తయారు చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టుకు లేపనంగా వేసి బాగా ఆరిన తర్వాత,మైల్డ్ షాంపుతో స్నానం చేయడం వల్ల, నిర్జీవంగా,నిస్సత్తుగా మారిన జుట్టు  మృదువుగా, పట్టు కుచ్చులా తయారవుతుంది.ఈ కాషాయంను తరుచూ తీసుకోవడం వల్ల ఇందులో ఆంటీ ఫంగల్ మరియు ఆంటీ యాక్సిడెంట్లు రోగ నిరోధక శక్తి పెంచడంలో సహాయపడి, వివిధ రోగాలు దరి చేరకుండా చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: