మీ జ్ఞాపకశక్తి మెరుగుపరచుకోవాలి అనుకుంటున్నారా.. అయితే ఈ ఒక్క మొక్క చాలు..!

Divya

ఈ మధ్యకాలంలో పని ఒత్తిడి, తినే ఆహారం మీద జ్ఞాపకశక్తి ఆధారపడి ఉంది. రోజురోజుకీ ప్రతి ఒక్కరికి జ్ఞాపకశక్తి మందగిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా పిల్లలలో ఎక్కువగా మొబైల్, టీవీ ఎక్కువగా చూడడం వల్ల ఆలోచించడం మందగించి జ్ఞాపకశక్తి తగ్గిపోతూ వస్తుంది. ఇలాంటివారు కొన్ని ఆయుర్వేద మూలికలు వాడడం వల్ల జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోవచ్చు. ఆయుర్వేద మూలికల్లో భాగంగా బ్రహ్మీ దీనికి చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్రహ్మీ ఒక జ్ఞాపక శక్తికే కాక చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
 జ్ఞాపక శక్తి కోసం..
 బ్రహ్మీ ఆకుల రసాన్ని ఒక గ్లాసు నీళ్లతో కలిపి రోజు తాగడం వల్ల మెదడులోని నరాల మీద ప్రభావం చూపి జ్ఞాపక శక్తి మెరుగయ్యేలా చేస్తుంది. దీని పూల కషాయం రోజు తీసుకోవడం వల్ల ఏకాగ్రత పెంచుతుంది.ఇది మొత్తం శరీరంలోని నరాల మీద ప్రభావం చూపి ఒత్తిడి, నిరాశ, నిస్పృహలను తొలగిస్తుంది.మెదడును ప్రశాంతంగా ఉంచడంలో సహాయం చేస్తుంది.
 మైగ్రేన్ నొప్పి
కొంతమంది మైగ్రేన్ నొప్పితో చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటివారు బ్రహ్మీ ఆకుల రసాన్ని తలపై లేపనంగా వేసుకోవడం వల్ల మైగ్రేన్ నొప్పి క్రమంగా తగ్గుతుంది.
 క్యాన్సర్ విరుగుడు..
ఇందులో ఉన్న యాంటీ యాక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల, క్యాన్సర్ కారకాలతో పోరాడి, క్యాన్సర్ నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది. అంతేకాక ఇది శరీరం నుంచి వ్యర్థాలను తొలగించిశుభ్రం చేసే గుణం కలిగి ఉంటుంది.
 బ్లడ్ ప్యూరిఫైయర్..
బ్రహ్మీ ఆకుకు సాధారణంగానే బ్లడ్ ప్యూరిఫై చేసే గుణం ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేసి, గుండె ఆరోగ్యం దెబ్బతినకుండా సహాయపడుతుంది. రక్తహీనతతో బాధపడే వారికి బ్రహ్మీ  ఆకుల రసాన్ని,రోజు మార్చి రోజు ఒక గ్లాసు నీళ్లతో కలిపి ఇవ్వడం వల్ల రక్తం వృద్ధి చెందుతుంది.
అందానికి
 బ్రహ్మీ ఆకుల రసం ముఖంపై గల మొటిమలు మచ్చలను ఈజీగా తొలగిస్తుంది. అంతేకాక ఓపెన్ ఫోర్స్ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ నీ కూడా తొందరగా తగ్గేలా చేస్తుంది. ఈ చర్మ సమస్యలతో బాధపడేవారు బ్రహ్మీ ఆకుల రసాన్ని పసుపు, పాలతో కలిపి ముఖానికి లేపనంగా వేసుకోవడం వల్ల ముఖంపై గల ఎటువంటి చర్మ సమస్యనైనా తొలగిస్తుంది. అంతేకాక ఈ ఆకుల రసాన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేయడం వల్ల తలలో అధికంగా ఉన్న నూనెలను రిమూవ్ చేసి చుండ్రు నుండి కాపాడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: