లైఫ్ స్టైల్: ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగడం మంచిదేనా..?

Divya
ప్రస్తుతం బిజీ లైఫ్ ఉన్న కారణం చేత ఏ ఒక్కరు సరిగ్గా సమయానికి భోజనం తింటూ ఉండరు. అందుచేతనే ఏవో ఒక ఆరోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. ముఖ్యంగా నిద్రలేమి సమస్య పౌష్టికాహారలోపం వంటి సమస్యలు చాలా చుట్టుముడతాయి. ఇలాంటివారిలో ముఖ్యంగా అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు ఈ మధ్య మరింత పెరిగిపోయాయని కొన్ని అధ్యయనాలలో తెలియజేయడం జరిగింది. బరువు తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రజలు. కొంతమంది యోగ , వ్యాయామం వంటివి చేయడం వల్ల బరువు తగ్గుతారని నమ్ముతూ ఉంటారు. అయితే నీటినీ తాగడం వల్ల బరువు తగ్గుతారా లేదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే గోరువెచ్చని నీటిని తాగడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వాటితో పాటే నష్టాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగినట్లు అయితే శరీరంలో ఉండే టాక్సిన్స్ బయటకి వెళ్లిపోతాయి అలాగే మనం భోజనం చేసిన తరువాత గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ వేగవంతంగా పనిచేస్తుంది. అధిక మొత్తంలో నీటిని తాగడం వల్ల బరువు తగ్గవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు.

భోజనం చేసే ముందు నీటిని తాగి భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ చాలా మెరుగుపడుతుంది అంతేకాకుండా వేడి నీరు కొవ్వును విచ్చిన్నం చేసి జీర్ణ క్రియ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. ముఖ్యంగా ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తినడం వల్ల ప్రతిరోజు కావలసినంత శక్తి కూడా లభిస్తుంది. ముఖ్యంగా పగటిపూట భోజనం అసలు మానేయకూడదు. ఆకలిగా అనిపిస్తే ఏవైనా పండ్లు విత్తనాలను తినమని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుచేత అంటే వీటిలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది కనుక శరీరానికి అలసటగా అనిపించదు. ఇలాంటి పద్ధతులను పాటించడం వల్ల బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు వేడి నీటిని తాగవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: