లైఫ్ స్టైల్: వంటింటి పదార్థాలతో విటమిన్ డి పొందవచ్చా..?

Divya
విటమిన్ డి శరీరానికి ఎంత అవసరమో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా విటమిన్ డి మాత్రమే కాకుండా శరీరానికి కాల్షియం, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఇలా అన్నీ కూడా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇకపోతే ఇందులో ఏవి తక్కువైనా సరే మన శరీరం అనారోగ్య పాలవుతుంది. ఇలాంటి వాటిలో ముఖ్యంగా విటమిన్ డి తప్పనిసరి.. ముఖ్యంగా విటమిన్ డి అనేది శరీరానికి చాలా అవసరం. ఒకవేళ మన శరీరంలో విటమిన్ డి లోపిస్తే రక్తపోటు సమస్య ఎక్కువవుతుంది. అంతేకాదు క్రానిక్ పెయిన్స్ కూడా ఎక్కువగా వస్తాయి. త్వరగా అలసటకు గురి అవ్వడం, నిద్రపట్టకపోవడం బలహీనంగా మారడం లాంటి కారణాలు కూడా ఎక్కువవుతాయి.
ఇక గుండె ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి అంటే విటమిన్ డి చాలా అవసరం.. రక్తప్రసరణ మెరుగుపడాలన్నా కూడా విటమిన్ డి తప్పనిసరి కండరాలు దృఢంగా మారాలన్నా.. నిద్ర సరిగా పట్టాలన్నా,  బరువుని నియంత్రణ లో ఉండాలన్నా కూడా విటమిన్ డి తప్పనిసరి. ఇకపోతే కొంతమంది డిప్రెషన్ కు గురి అవుతూ ఉంటారు.. అలాంటి వారిలో విటమిన్ లోపించిందని గుర్తించాలి. విటమిన్ డి లోపం కారణంగా సంయమనం అసలు ఉండదు. డిప్రెషన్ ఏర్పడి మానసిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే విటమిన్ డి మనకు ఎలా దొరుకుతుంది అంటే వంటింట్లో లభించే పాలు,  గుడ్లు, చేపల గుడ్లు, చేపలు, మష్రూమ్స్ వంటి వాటి వల్ల విటమిన్ డీ ఎక్కువగా లభిస్తుంది.
ఇకపోతే వీటిని ప్రతిరోజు తినలేము అనుకునేవారు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి ఎనిమిది గంటల సమయంలో సూర్య రశ్మికి బయట అటు ఇటు నడవడం వల్ల విటమిన్ డి శరీరానికి లభిస్తుంది. ఇక విటమిన్ డి లోపం ఏర్పడకుండా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు ఇలాంటి ఆహారాలను మీ డైలీ వారి భోజనంలో తీసుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: