ఇలా వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మేలు!

Purushottham Vinay
ఇక రోజూ గంట పాటూ వాకింగ్ చేస్తే వారంలోనే 3 కిలోల వరకు బరువు తగ్గే అవకాశం ఉంది. ఇలా 12 వారాల పాటూ చేస్తే 30 కిలోలు తగ్గొచ్చు అని నిపుణులు చెబుతున్నారు.వాకింగ్ ద్వారా బరువు తగ్గడం చాలా ఆరోగ్యకరమైన పద్ధతి. అయితే ఈ సమయంలో ఆహారాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. పోషకాహార నిపుణుల సాయం తీసుకుని నీరసం రాకుండా డైట్ ని ప్లాన్ మార్చుకోవాలి. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని వారు తినాల్సిఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాన్ని వారు ఎంచుకోవాలి. పిండి పదార్థాలు తక్కువగా ఉండేలా ఖచ్చితంగా చేసుకోవాలి. పండ్లు ఇంకా కూరగాయలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. ఈ సమయంలో మాంసాహారాన్ని కూడా తగ్గాంచాలి. కొలెస్ట్రాల్ చేరే అవకాశం ఉన్న ఏ ఆహారాన్ని కూడా తీసుకోకూడదు.వాకింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా చేతులు ఊపుతూ నడవాలి. వేగంగా నడవాలి. మెల్లగా నడవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. 


అలాగని ప్రారంభం నుంచి అసలు వేగంగా నడవకూడదు. మెల్లగా మొదలుపెట్టి క్రమంగా వేగంని పెంచుకుంటూ వెళ్లాలి. మొదటిరోజే గంట నడవడం కష్టం అనుకునేవాళ్లు ఇక రెండు మూడు రోజులు అరగంట పాటూ నడిచి క్రమంగా సమయాన్ని పెంచుకుంటూ వెళితే చాలా మంచిది.వాకింగ్ వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అల్జీమర్స్ ఇంకా మతిమరుపు వంటి సమస్యలు రావు.అలాగే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. అంధత్వానికి కారణమయ్యే గ్లకోమాను కూడా నిరోధిస్తుంది.ఇక అమెరికా హార్ట్ అసోసియేషన్ తెలిపిన ప్రకారం గుండెకు కూడా చాల మేలు. రక్తసరఫరా బాగా జరిగి గుండె పోటు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.ఇంకా అధిక రక్తపోటు ఉన్నవారికి వాకింగ్ చాలా అవసరం. బీపీ కూడా అదుపులో ఉంటుంది.ఇంకా అలాగే నడక వల్ల ఊపిరితిత్తులకు చాలా మేలు. దానికి సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.ఇలా వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మేలు!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: