భ‌ర్త‌ను ఎంపీని చేసేందుకు భార్య‌... భార్య‌ను ఎంపీ చేసేందుకు భ‌ర్త... ఈ క‌ష్టాలు చూశారా..?

RAMAKRISHNA S.S.
- మ‌ల్కాజ్‌గిరిలో ఈట‌ల వ‌ర్సెస్ సునీతా రెడ్డి
- సునీత గెలుపుకోసం మ‌హేంద‌ర్ రెడ్డి మంత్రాంగం
- ఈట‌ల గెలుపుకోసం క‌ష్ట‌ప‌డుతోన్న జ‌మునారెడ్డి
( హైద‌రాబాద్‌ - ఇండియా హెరాల్డ్ )
ఏపీ, తెలంగాణ ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. అటు తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల ప్రచారం.. ఇటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల ప్రచారం మామూలుగా లేదు. ఈ క్రమంలోనే పలు నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న వారికోసం వారి కుటుంబ సభ్యులు కష్టపడుతున్న తీరు, వ్యవహాలు ప‌దునెక్కుతున్నాయి. భర్తల పోటీ చేస్తున్న చోట్ల భర్తలను గెలుపు తీరాలకు చేర్చేందుకు వారు ఎండలో పడుతున్న కష్టాలు మామూలుగా లేవు. అలాగే భార్యలు పోటీ చేస్తున్న చోట భార్యలను చట్టసభలకు పంపేందుకు భర్తలు తెరవెనక పడుతున్న కష్టాలు కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి.

ఈ క్రమంలోనే తెలంగాణలో పార్లమెంట్ కి పోటీ చేస్తున్న ఒక భర్త కోసం భార్య పడుతున్న కష్టం... అలాగే ఒక భార్యను ఎంపీ చేసినందుకు భర్త పడుతున్న కష్టాలు మామూలుగా లేవు. మల్కాజ్గిరి నుంచి బిజెపి తరఫున ఆ పార్టీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో హుజురాబాద్ - గజ్వేల్ నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయిన ఈటెలకు ఈ ఎన్నికలు చావో రేవో అన్నట్టుగా ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనను గెలిపించేందుకు భర్త జమునా రెడ్డి ప్రచారంలో బాగా కష్టపడుతున్నారు.

రాజేందర్ రాజకీయ జీవితం ఆరంభం నుంచి కూడా జమునా రెడ్డి ఎంతో కష్టపడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తన భర్తకు చావో రేవుగా మారిన ఎన్నికల కోసం తన వంతుగా ఆమె కష్టపడుతున్నారు. ఇక తన భార్యను ఎంపీని చేసేందుకు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి చెమటోడుస్తున్నారు టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి మల్కాజ్గిరిలో కాంగ్రెస్ తరపున పట్నం సునీత రెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె వికారాబాద్ జడ్పీ చైర్మన్గా ఉన్నారు. ఎలాగైనా తన భార్యను పార్లమెంటుకు పంపాలని మహేందర్ రెడ్డి కసితో పనిచేస్తున్నారు.

ఇలా ఒకే పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న ఈటెల కోసం భార్య ఇటు సునీత కోసం భర్త మహేందర్ రెడ్డి ప్రచారం చేస్తున్న తీరు ఇవన్నీ స్థానికంగా హైలెట్‌గా నిలుస్తున్నాయి. అందులోనూ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం దేశంలోని పెద్దది కావడంతో... ఇక్కడ రాజకీయం మామూలుగా లేదు. ఈ సీటును గెలుచుకునేందుకు కాంగ్రెస్ - బీఆర్ఎస్ - బిజెపి మూడు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: